నేడు "ఆకాశవాణి" లో షైన్ విద్యార్థుల కార్యక్రమం
హనుమకొండ న్యూస్ : హనుమకొండ లోని 4వ డివిజన్ కిషన్ పుర లోని షైన్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆకాశవాణి కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో పాల్గోన్నారు.చిన్నారి లోకం శీర్షికన పిల్లల కార్యక్రమంలో భాగంగా 20 మంది విద్యార్థులు వరంగల్ ఆకాశవాణి కేంద్రంలో పాటలు,నాటిక, పద్యాలు, స్కిట్,ప్రసంగం,కథ, జీకే తో పాటు సూక్తులు తదితర అంశాల్లో పాల్గోని ప్రతిభ చాటారు.విద్యార్థుల్లో పఠన నైపుణ్యాలను పెంపొందించడానికి ఇది ఎంతో దోహదం చేస్తుందని షైన్ ఉన్నత పాఠశాల చైర్మన్ కుమార్ యాదవ్ అన్నారు.విద్యార్థులు చదువుతో పాటు,వివిధ సహ పాఠ్య కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనడానికి,స్టేజ్ ఫియర్ పోగొట్టడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.చదువుతో పాటు వివిధ రంగాల్లో విద్యార్థులకు న్న ప్రతిభను గుర్తించి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమానికి తోడ్పాటును అందించిన పాఠశాల హెడ్మాస్టర్ కవిత రాణి, గైడుగా వ్యవహరించిన ఉపాధ్యాయులు జయరాజు ను అభినందించారు.ఈ కార్యక్రమానికి అవకాశం కల్పించినటువంటి ఆకాశవాణి ప్రోగ్రాం హెడ్ ఇల్లందుల రవికుమార్ కు,ప్రోగ్రాం ఇంచార్జ్ నరేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం అక్టోబర్ 4వ తేది ఆదివారం ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా షైన్ ఉన్నత పాఠశాల పిల్లలు ప్రదర్శించిన కార్యక్రమం ప్రసారం అవుతుందని తెలిపారు.కార్యక్రమానికి సహకరించినటువంటి ఉపాధ్యాయులకు విద్యార్థినీ, విద్యార్థుల తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


