గాంధీ స్ఫూర్తితో గ్రామాభివృద్ధికి బాటలు

గాంధీ స్ఫూర్తితో గ్రామాభివృద్ధికి బాటలు

సర్పంచ్ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సోలిపేటలో గ్రామసభ

షాబాద్,(రంగారెడ్డి):  షాబాద్ మండలంలోని సోలిపేట గ్రామంలో శుక్రవారం గ్రామసభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో అమలు చేయనున్న వీబీజీ రాంజీ పథకంపై గ్రామసభలో చర్చించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ప్రజల సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని నిర్ణయించారు. గ్రామాభివృద్ధికి ప్రజలందరూ భాగస్వాములై సహకరించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. గాంధీజీ చూపిన గ్రామ స్వరాజ్య స్ఫూర్తితో గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అహ్మదీ బేగం ఆయాజ్, వార్డు సభ్యులు ప్రవీణ్ కుమార్, గోకం కృష్ణ, చంద్రకళ, పాండు, బండారి సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

 ఆశ్రమ పాఠశాలలో పీఓ ఆకస్మిక తనిఖీ.. విద్యార్థుల సమస్యలపై ఆరా  ఆశ్రమ పాఠశాలలో పీఓ ఆకస్మిక తనిఖీ.. విద్యార్థుల సమస్యలపై ఆరా
నల్లబెల్లి, (వరంగల్ జిల్లా): మండలంలోని మూడుచెక్కలపల్లి గ్రామంలోని  ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలను ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో శనివారం...
నంబర్ ప్లేట్ లేకుండా వాహనం నడిపితే చర్యలు తప్పవు 
అనంతగిరి బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే జిఎంఆర్
అంగన్వాడీ సిబ్బంది సేవలకు ఘన సన్మానం
జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి: మెట్టు శ్రీధర్
కళ్యాణ లక్ష్మి పథకానికి 12 ఏళ్లు.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
అనంతగిరి బస్సు ప్రమాదంపై ఎమ్మెల్యే జిఎంఆర్ తీవ్ర విచారం