తపస్ ఆధ్వర్యంలో లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి
చేగుంట : తపస్ చేగుంట మండల శాఖ ఆధ్వర్యంలో లాల్ బహుదూర్ శాస్త్రి జయంతిని పి.ఎం.శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చేగుంటలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తపస్సు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చల్లా లక్ష్మణ్ మాట్లాడుతూ సందర్భంగా తపస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చల్లా లక్ష్మణ్ మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్యోద్యమం లో ప్రముఖ పాత్ర వహించాడు అని, మొదట రైల్వే మంత్రిగా, హోంమంత్రిగా, భారతదేశానికి రెండవ ప్రధానమంత్రిగా పనిచేసే భారతదేశానికి సేవలందించారని, అతను 1965 ఇండో-పాకిస్థాన్ యుద్ధ కాలంలో దేశాన్ని నడిపించిన గొప్ప వ్యక్తి అని, అతని నిక్తి అని, దేశాన్ని రక్షించడానికి జవాన్ ఎంత ముఖ్యమో, భారతదేశానికి అన్నం పెట్టడానికి రైతు అంత ముఖ్యమని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో తపస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రావుల వెంకటేష్, తంగేళ్లపల్లి కృష్ణమూర్తి, తపస్ జిల్లా నాయకులు పూల బోయిన దేవానంద్, సుమతి, పట్లూరి యాదగిరి, రమేశ్ పి ఆర్ టి యు జిల్లా ఉపాధ్యక్షులు చల్లా రామకృష్ణ, బాలు, సి అర్ పి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


