రోస్టర్ విధానాన్ని సవరించాలి 

రోస్టర్ విధానాన్ని సవరించాలి 

మాలో ఐక్యవేదిక ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు దోశల చంద్రం

గంభీరావుపేట : చలో ఉస్మానియా యూనివర్సిటీ  హైదరాబాద్ లో 4 వ తేదీన జరిగే సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శనివారం గంభీరావుపేట మండల కేంద్రంలో జాతీయ మాలల ఐక్యవేదిక ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం  దోసల  చంద్రం మాట్లాడుతూ జీవో నెంబర్ 99 నీ వెంటనే సవరించాలి అని 20 లోపు రెండు రోస్టర్ పాయింట్లను సరిచేసి మాలలకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించడం జరుగుతుంది అని అన్నారు. విద్యా ఉద్యోగ అవకాశాలలో జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలని రోస్టర్ విధానాన్ని సమీక్షించి సవరించాలని   రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ ఉద్దేశం అణగారిన వర్గాలకు విద్య, ఉద్యోగ రంగాల్లో సమాన అవకాశాలు కల్పించడమేనని, అయితే ప్రస్తుత రోస్టర్ విధానం కారణంగా మాలలకు రావాల్సిన అవకాశాలు తగ్గిపోతున్నాయని ఆరోపించారు. ఒక తరం విద్యార్థులు, నిరుద్యోగులు అవకాశాలు కోల్పోయే విధంగా రోస్టర్ విధానం ఉండకూడదని పేర్కొన్నారు.గత 30 ఏళ్లుగా వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలు ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాలు చేస్తున్నారని, దళితుల ఐక్యత కోసం ఎన్నో ఉద్యమాలు నిర్వహించామని తెలిపారు. రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు అనేకసార్లు వినతిపత్రాలు అందజేసినా సమస్య పరిష్కారం కాలేదని అన్నారు.   ఎస్సీ వర్గీకరణ, ప్రస్తుత రోస్టర్ విధానం వల్ల మాల ఉద్యోగులు, విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతోందని‌ దోసల చంద్రం  అన్నారు  మాలలకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టి, విద్య, ఉద్యోగ రంగాల్లో సమాన అవకాశాలు కల్పించేలా రోస్టర్ విధానాన్ని సవరించాలని  ప్రభుత్వం ఈ సమస్యపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని,  తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు లక్కం బాబు జిల్లా నాయకులు పిట్ల రఘు రాగులమహేందర్ లక్కం నాంపల్లి  నాందేడ్ మనోజ్ కుమార్ ఎడ్ల రాజు కాడారి  సందీప్ బంటు కిషన్ బండ నిశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Views: 10

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష శిబిరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష శిబిరం
నారాయణ పేట జిల్లా, మక్తల్ పట్టణం లో ఉచిత కంటి పరిక్ష శిబిరం   లయన్ అనుగొండ శ్రీనివాసులు డిస్ట్రిక్ విజన్ ఛైర్మెన్  ఆధ్వర్యంలో రామ్ రెడ్డి లయన్స్...
రోస్టర్ విధానాన్ని సవరించాలి 
చౌటకూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా బోడపట్ల గణేష్ ముదిరాజ్ బీసీ వర్గానికి చెందిన వ్యక్తి ఎంపిక
డీ 86 కెనాల్ కు భిగించిన రైతుల విద్యుత్ మోటార్ల చోరి.
ఏఐటీయూసీలో 104 మంది యువ కార్మికుల చేరిక
యశోద ఆసుపత్రి క్లినికల్ డైరెక్టర్, మెడికల్ ఆంకాలజిస్ట్, హ్యూమటాలజిస్ట్ డాక్టర్ భరత్ ఎ. వస్వని 
కమాన్‌పూర్‌లో విజిలెన్స్ అధికారుల తనిఖీలు.!