జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

  • -పెద్దపల్లిలో డిమాండ్స్‌ డే..
  • -నల్లబ్యాడ్జీలతో జర్నలిస్టుల నిరసన
  • -ప్రత్యేక రక్షణ చట్టం కోసం డిమాండ్

పెద్దపల్లి:  జర్నలిస్టుల హక్కులు, భద్రతను పరిరక్షిస్తూ వారి దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని టీయూడబ్ల్యూజే-ఐజేయూ నాయకులు డిమాండ్‌ చేశారు. ఐజేయూ జాతీయ కార్యవర్గ నిర్ణయం మేరకు మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ‘జర్నలిస్టుల డిమాండ్స్‌ డే’ నిర్వహించారు. తొలుత గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి  నివాళులర్పించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టుల స్మారకార్థం రెండు నిమిషాలు మౌనం పాటించారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపి, అనంతరం కలెక్టరేట్‌కు చేరుకుని అధికారులకు వినతిపత్రం సమర్పించారు. టీయూడబ్ల్యూజే-ఐజేయూ జిల్లా అధ్యక్షుడు మల్లవర్జుల వంశీ విద్యానంద్, ప్రధాన కార్యదర్శి నారాయణదాసు అశోక్‌ మాట్లాడుతూ.. జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక కేంద్ర చట్టం తీసుకురావాలని, డిజిటల్‌ యుగానికి అనుగుణంగా సమగ్ర మీడియా కమిషన్‌ ఏర్పాటు చేయాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న వేతన సవరణలను చేపట్టి నూతన వేతన మండలిని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. జర్నలిస్టులకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు, హెల్త్‌ కార్డులు కల్పించాలని, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పాటు రైల్వే పాసులను పునరుద్ధరించాలని కోరారు. సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తులో జిల్లావ్యాప్తంగా శాంతియుత ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే-ఐజేయూ ప్రతినిధులు, ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, డిజిటల్‌ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు.

Views: 20

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు
హనుమకొండ న్యూస్ : జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని హనుమకొండ బాలసముద్రంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో గాంధీ జయంతి...
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఇకపై ప్రతి శనివారం బ్యాంకులకు సెలవు
సోన్పల్లి లో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి
బీజేపీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ లో స్వచ్ఛ భారత్
గ్రామసభల్లో ఇంకుడు గుంతలు, ఫామ్‌ పాండ్ల ఏర్పాటుపై అవగాహన
తపస్ ఆధ్వర్యంలో  లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి