సోన్పల్లి లో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి

సోన్పల్లి లో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి

  • 98 గంజాయి మొక్కలు స్వాధీనం
  •  విలువ సుమారు రూ.9.80 లక్షలు
  • ఎన్ డి పి సి చట్టం కింద కేసు నమోదు*
  • ఇచ్చోడ రూరల్ సీఐ సిహెచ్ రమేష్*

ఆదిలాబాద్ జిల్లా, సిరికొండ : ఇచ్చోడ రూరల్ సీఐ సీహెచ్. రమేష్, సిరికొండ ఎస్సై విక్రం ఆధ్వర్యంలో పోలీసులు సోన్పల్లి గ్రామంలో అక్రమంగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సోన్పల్లి గ్రామానికి చెందిన నిందితుడు తోడసం ముయ్య (78) తన ఇంటి ముందు భాగంలో అక్రమంగా గంజాయి మొక్కలను సాగు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో సీఐ సీహెచ్. రమేష్ సదరు ఇంటిపై పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిందితుడు తోడసం ముయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా,గంజాయిని సేవించడం, విక్రయించి డబ్బులు సంపాదిం చేందుకు సాగు చేస్తున్నట్లు వెల్లడించాడు. ఇంటి వద్ద సాగు చేస్తున్న 98 గంజాయి మొక్కలను తొలగించి, సుమారు రూ.9,80,000 విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితుడిపై ఎన్ డి పి సి చట్టం కింద కేసు నమోదు చేసి, గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఇచ్చోడ రూరల్ సీఐ సీహెచ్. రమేష్ తెలిపారు. గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ సాగు, విక్రయాలు లేదా వినియోగానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. గంజాయి పండించిన రవాణా చేసిన వ్యాపారం చేసిన సేవించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు అదేవిధంగా గంజాయి పండించిన రైతులకు ప్రభుత్వ పథకాలు రాకుండా సిఫార్సు చేయడం జరిగిందని, జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 150 ఎకరాలకు ప్రభుత్వ పథకాలు వర్తించకుండా చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు.

Views: 6

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు
హనుమకొండ న్యూస్ : జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని హనుమకొండ బాలసముద్రంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో గాంధీ జయంతి...
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఇకపై ప్రతి శనివారం బ్యాంకులకు సెలవు
సోన్పల్లి లో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి
బీజేపీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ లో స్వచ్ఛ భారత్
గ్రామసభల్లో ఇంకుడు గుంతలు, ఫామ్‌ పాండ్ల ఏర్పాటుపై అవగాహన
తపస్ ఆధ్వర్యంలో  లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి