ఆలయ నిర్మాణంలో భూమి పూజ
- శ్రీశ్రీశ్రీ అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర ఆలయ నిర్మాణంలో బాత్రూంలో నూతన భూమి పూజ కార్యక్రమాలు శ్రీకారం
- నూతన బాత్రూంలో నిర్మాణం శ్రీకారం సర్పంచ్ పార్కల రామ్ రెడ్డి ఆధ్వర్యంలో
- పురాతనమైన ఆలయం శ్రీశ్రీశ్రీశ్రీ అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర ఆలయం
చౌటకూర్, : చౌటకూర్ మండల కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం చేపట్టనున్న నూతన బాత్రూం నిర్మాణ పనులకు శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.గ్రామ సర్పంచ్ పార్కల రామ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి, భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.ఈ సందర్భంగా సర్పంచ్ పార్కల రామ్ రెడ్డి మాట్లాడుతూ.. ఆలయానికి వచ్చే భక్తులు, గ్రామ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించాలనే ఉద్దేశంతో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నూతన బాత్రూం నిర్మాణ పనులను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ పనుల కోసం గ్రామపంచాయతీ నిధుల నుంచి రూ.90 వేల నిధులు మంజూరయ్యాయని, అలాగే సీఎస్‌సీ కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణం కోసం ఎస్‌బీఎం 2.0 పథకం కింద రూ.2.10 లక్షల నిధులు మంజూరయ్యాయని తెలిపారు.మొత్తం రూ.3 లక్షల నిధులతో అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు.ఆలయానికి వచ్చే భక్తులకు పరిశుభ్రమైన వాతావరణం, ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో ఉండేలా నిర్మాణ పనులను నాణ్యతతో పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. గ్రామ అభివృద్ధితో పాటు ప్రజలకు, భక్తులకు ఉపయోగపడే మౌలిక వసతుల కల్పనకు గ్రామపంచాయతీ తరఫున ప్రాధాన్యత ఇస్తున్నామని సర్పంచ్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శంకర్, ఎంపీఓ సువర్ణ, గ్రామపంచాయతీ కార్యదర్శి సందీప్ గౌడ్, మల్లికార్జున్ గౌడ్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వర్కల రమేష్, మాజీ ఉపసర్పంచ్ రామా గౌడ్, ఏ పి ఓ రామ్మోహన్, గాండ్ల శీను, సుధాకర్ గౌడ్, దమ్మి కిట్టు, మాణిక్య రెడ్డి, వార్డు సభ్యులు మంగలి బాలు, గంగారం, రాజేశ్వర్ గౌడ్, మహేష్‌తో పాటు గ్రామ యువకులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


