జిన్నారం మండల కేంద్రంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి

జిన్నారం మండల కేంద్రంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి

  • గ్రామ స్వరాజ్య స్థాపనకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలి
  • రాష్ట్ర యువజన సంఘాల కార్యదర్శి డా.ఏర్పుల శ్రీనివాస్,...
  • యువజన నాయకుడు పుట్టి భాస్కర్, నీలం లత, నాగరాజు

సంగారెడ్డి జిల్లా జిన్నారం, : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిన్నారంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి యువజన సంఘాల సమితి నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు, గ్రామ పెద్దలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర యువజన సంఘాల కార్యదర్శి దళితరత్న డా. ఏర్పుల శ్రీనివాస్, యువజన సంఘాల నాయకుడు పుట్టి భాస్కర్, మహిళా సంఘం నాయకురాలు నీలం లత, యువజన నాయకుడు నాగరాజు, దళిత సంఘం నాయకుడు జంగోని దుర్గయ్య వడ్ల జీతాచారి మాట్లాడుతూ....భారత స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మా గాంధీ పోషించిన పాత్రను స్మరించుకున్నారు. బ్రిటిష్ పాలన నుంచి దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు గాంధీజీ అహింసా మార్గాన్ని ఆయుధంగా చేసుకుని ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చారని తెలిపారు. సత్యం, అహింస, సామాజిక సమానత్వం, ప్రజల భాగస్వామ్యం వంటి విలువలను సమాజానికి అందించారని పేర్కొన్నారు. గాంధీజీ స్వాతంత్ర్య సాధనతో పాటు గ్రామాల అభివృద్ధికి, ప్రజల భాగస్వామ్యంతో కూడిన గ్రామ స్వరాజ్య స్థాపనకు ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని ఆయన భావించారని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామాల అభివృద్ధి, పరిశుభ్రత, సామాజిక సమానత్వం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం యువత, మహిళలు చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. గాంధీజీ ఆశయాలను ఆచరణలో పెట్టేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని కోరారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని వారు పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో యువజన సంఘాల సభ్యులు, మహిళా సంఘాల నాయకురాళ్లు, గ్రామ పెద్దలు, దళిత సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను స్మరించుకుంటూ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పోచమ్మలస్వామి, నీలం సత్యనారాయణ, వడ్ల జీతాచారి, నీలం వెంకటేష్, కృష్ణ, సీత రాజు యాదవ్, దర్జ వెంకటేష్,

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు
హనుమకొండ న్యూస్ : జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని హనుమకొండ బాలసముద్రంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో గాంధీ జయంతి...
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఇకపై ప్రతి శనివారం బ్యాంకులకు సెలవు
సోన్పల్లి లో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి
బీజేపీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ లో స్వచ్ఛ భారత్
గ్రామసభల్లో ఇంకుడు గుంతలు, ఫామ్‌ పాండ్ల ఏర్పాటుపై అవగాహన
తపస్ ఆధ్వర్యంలో  లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి