అధికారుల నిర్లక్ష్యం.. కళ్లముందే ఎండిపోతున్న పంటలు
- యక్కర్పల్లి శివారులో రెండు నెలలుగా మొరాయించిన ట్రాన్స్‌ఫార్మర్
- పట్టించుకోని విద్యుత్ శాఖ అధికారులు
సారంగాపూర్ : అన్నదాతల కష్టాలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. సారంగాపూర్ మండలంలోని ఆలూరు సబ్‌స్టేషన్ పరిధిలోని యక్కర్పల్లి శివారు చౌరస్తా వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయి ఏకంగా రెండు నెలలు కావొస్తున్నా విద్యుత్ శాఖ అధికారుల్లో మాత్రం చలనం లేదు. సాగు కోసం విద్యుత్ లేక పొలాలు బీడువారే పరిస్థితికి చేరుకున్నాయి. కాలం కలిసిరాక, మరోవైపు అధికారుల ఉదాసీనత వల్ల తమ పెట్టుబడులు బూడిదవుతున్నాయని రైతులు వాపోతున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయిన విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, తక్షణమే కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ను బిగించి తమను ఆదుకోవాలని రైతన్నలు కోరుతున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


