లో వోల్టేజ్ సమస్యతో రోడ్డెక్కిన రైతులు

పంటలు ఎండిపోతున్నా పట్టించుకోవడం లేదంటూ ఆవేదన

బిచ్కుంద,  : పార్టీలకతీతంగా రైతులంతా ఒక్కటై జై కిసాన్ నినాదాలతో రైతుల సమస్యలు తీర్చాలంటూ రోడ్డెక్కారు. పంటలకు అవసరమైన విద్యుత్‌ను అందించాలని, త్రీఫేజ్ విద్యుత్ సరఫరాలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని ఇస్రాత్‌పూర్, సీతారాం పల్లి, మానేపూర్, రాజాపూర్, ఎల్లారం తదితర గ్రామాలకు చెందిన రైతులు శుక్రవారం రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. 161 జాతీయ రహదారిపై రైతులు నిరసన చేపట్టడంతో కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైతులు మాట్లాడుతూ.. వ్యవసాయానికి సరైన విద్యుత్ సరఫరా లేకపోవడంతో బోర్లు పనిచేయడం లేదని, పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్కువ వోల్టేజ్ కారణంగా మోటార్లు కాలిపోతున్నాయని, విద్యుత్ శాఖ అధికారులు సమస్యను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. విద్యుత్ సమస్యను వెంటనే పరిష్కరించి రైతులకు నాణ్యమైన త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు. కాగా, రైతుల ఆందోళనకు సంబంధించిన అంశంపై ఇటీవలి కాలంలో తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లోనూ విద్యుత్ సరఫరా సమస్యలపై రైతుల నిరసనలు నమోదయ్యాయి.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

 ఆశ్రమ పాఠశాలలో పీఓ ఆకస్మిక తనిఖీ.. విద్యార్థుల సమస్యలపై ఆరా  ఆశ్రమ పాఠశాలలో పీఓ ఆకస్మిక తనిఖీ.. విద్యార్థుల సమస్యలపై ఆరా
నల్లబెల్లి, (వరంగల్ జిల్లా): మండలంలోని మూడుచెక్కలపల్లి గ్రామంలోని  ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలను ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో శనివారం...
నంబర్ ప్లేట్ లేకుండా వాహనం నడిపితే చర్యలు తప్పవు 
అనంతగిరి బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే జిఎంఆర్
అంగన్వాడీ సిబ్బంది సేవలకు ఘన సన్మానం
జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి: మెట్టు శ్రీధర్
కళ్యాణ లక్ష్మి పథకానికి 12 ఏళ్లు.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
అనంతగిరి బస్సు ప్రమాదంపై ఎమ్మెల్యే జిఎంఆర్ తీవ్ర విచారం