ఉపసర్పంచ్‌ల చెక్ పవర్‌పై ఆంక్షలు తొలగించాలి
- హక్కులను కాపాడాలి.. గౌరవ వేతనం అందించాలి
- జాయింట్ చెక్ పవర్‌ను యథావిధిగా కొనసాగించాలి
ఎల్లారెడ్డిపేట,ఉపసర్పంచ్‌ల చెక్ పవర్‌పై విధిస్తున్న ఆంక్షలను ప్రభుత్వం వెంటనే తొలగించాలని ఎల్లారెడ్డిపేట మండల ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు మందాటి రాము యాదవ్ డిమాండ్ చేశారు. ఉపసర్పంచ్‌ల హక్కులను కాపాడటంతో పాటు వారికి గౌరవం, గౌరవ వేతనం కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా రాము యాదవ్ మాట్లాడుతూ.. ఉపసర్పంచ్‌లు రాజ్యాంగబద్ధంగా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధులని తెలిపారు. గ్రామపంచాయతీల్లో నిధుల దుర్వినియోగానికి అవకాశం లేకుండా పారదర్శక పాలన కొనసాగించేందుకు ఉపసర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్‌ను యథావిధిగా కొనసాగించాలని కోరారు. అదేవిధంగా మండల సర్వసభ్య సమావేశాలకు ఉపసర్పంచ్‌లను ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజలచే ఎన్నికైన ఉపసర్పంచ్‌లకు తగిన గౌరవం కల్పించడంతో పాటు గౌరవ వేతనం అందించాలని కోరారు. ఉపసర్పంచ్‌ల హక్కుల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఐక్యంగా ఉద్యమిస్తామని మందాటి రాము యాదవ్ స్పష్టం చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


