అంగన్వాడీ సిబ్బంది సేవలకు ఘన సన్మానం

అంగన్వాడీ సిబ్బంది సేవలకు ఘన సన్మానం

  • 19 అంగన్వాడీ కేంద్రాల టీచర్లు, ఆయమ్మలకు సత్కారం
  •  చిన్నారులకు పుస్తకాలు, స్నాక్స్ పంపిణీ

అమీన్పూర్,: పటాన్‌చెరు నియోజకవర్గం అమీన్‌పూర్ మండలం కిష్టారెడ్డిపేటలో అంగన్వాడీ టీచర్లు, ఆయమ్మలను ఘనంగా సన్మానించి, అంగన్వాడీ చిన్నారులకు పుస్తకాలు, స్నాక్స్, ఇతర అవసరమైన సామగ్రిని పంపిణీ చేశారు. అమీన్‌పూర్ బీజేపీ మండల అధ్యక్షుడు ఈర్ల రాజు ముదిరాజ్ ఆధ్వర్యంలో సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా సేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అమీన్‌పూర్ మండల పరిధిలోని 19 అంగన్వాడీ కేంద్రాలకు చెందిన టీచర్లు, ఆయమ్మలను శాలువాలతో సన్మానించి నూతన వస్త్రాలను అందజేశారు. అంగన్వాడీ చిన్నారులకు పుస్తకాలు, స్నాక్స్, ఇతర అవసరమైన సామగ్రిని పంపిణీ చేశారు. అంగన్వాడీ సిబ్బంది సేవలు అభినందనీయం ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు విద్య, పోషణ, ఆరోగ్యం, సంరక్షణ అందించడంలో టీచర్లు, ఆయమ్మలు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. చిన్నారుల భవిష్యత్తుకు పునాది వేస్తున్న వారి సేవలను గుర్తించి గౌరవించడం అభినందనీయమన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ..  సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా జిల్లాలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కిష్టారెడ్డిపేటలో అంగన్వాడీ టీచర్లు, ఆయమ్మలను గుర్తించి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించిన ఈర్ల రాజు ముదిరాజ్‌ను అభినందించారు. రాష్ట్ర నాయకులు ఆదెల్లి రవీంద్ర మాట్లాడుతూ.. సమాజంలో నిత్యం సేవలందిస్తున్న అంగన్వాడీ సిబ్బందిని గుర్తించి గౌరవించడం మంచి సంప్రదాయమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. మహిళలు, చిన్నారుల కోసం ఈర్ల రాజు ముదిరాజ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమన్నారు. అంగన్వాడీ సిబ్బంది సేవలను గుర్తించి సన్మానించడం ద్వారా వారికి సమాజం తరఫున గౌరవం అందించినట్లైందన్నారు. సేవలను గుర్తించడం సంతోషంగా ఉంది సన్మానం పొందిన అంగన్వాడీ టీచర్లు మాట్లాడుతూ.. తమ సేవలను గుర్తించి సన్మానించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. శాలువాలతో సత్కరించి నూతన వస్త్రాలు అందించడంతో పాటు చిన్నారులకు పుస్తకాలు, స్నాక్స్ అందించడం సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. తమ సేవలను గుర్తించిన ఈర్ల రాజు ముదిరాజ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాసేవకు పార్టీ కల్పించిన అవకాశాన్ని వినియోగిస్తా ఈర్ల రాజు ముదిరాజ్ ఈర్ల రాజు ముదిరాజ్ మాట్లాడుతూ.. పార్టీ తనకు అప్పగించిన బాధ్యతను ప్రజాసేవకు ఉపయోగించుకోవాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. అంగన్వాడీ టీచర్లు, ఆయమ్మలు చిన్నారుల భవిష్యత్తుకు పునాది వేస్తున్న సేవకులని, వారి సేవలను గుర్తించి గౌరవించడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం ఒక్క రోజుకే పరిమితం కాదని, అమీన్‌పూర్ మండల పరిధిలో సమాజంలోని చివరి వ్యక్తి వరకు సేవా కార్యక్రమాలను తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. మహిళలు, చిన్నారులు, పేదలు, సమాజంలోని వివిధ వర్గాలకు అండగా నిలిచే కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తానన్నారు. ప్రజాసేవే లక్ష్యంగా ప్రతి ఒక్కరి సేవను గుర్తిస్తూ ముందుకు సాగుతానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మీనా గౌడ్, జిల్లా ఇన్‌చార్జి శైలజ గౌడ్, జిల్లా నాయకురాలు అనూష, జిల్లా నాయకులు అంజిరెడ్డి, కొండ లక్ష్మణ్, మండల ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్, మండల ఉపాధ్యక్షులు రాజేందర్ గౌడ్, శ్రీధర్ రెడ్డి, మోర్చా అధ్యక్షులు మోహన్ నాయక్, మెహర్ ప్రసాద్, కట్ట గణేష్, బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్‌చార్జిలు, మహిళా నాయకులు, కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, ఆయమ్మలు తదితరులు పాల్గొన్నారు.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

 ఆశ్రమ పాఠశాలలో పీఓ ఆకస్మిక తనిఖీ.. విద్యార్థుల సమస్యలపై ఆరా  ఆశ్రమ పాఠశాలలో పీఓ ఆకస్మిక తనిఖీ.. విద్యార్థుల సమస్యలపై ఆరా
నల్లబెల్లి, (వరంగల్ జిల్లా): మండలంలోని మూడుచెక్కలపల్లి గ్రామంలోని  ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలను ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో శనివారం...
నంబర్ ప్లేట్ లేకుండా వాహనం నడిపితే చర్యలు తప్పవు 
అనంతగిరి బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే జిఎంఆర్
అంగన్వాడీ సిబ్బంది సేవలకు ఘన సన్మానం
జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి: మెట్టు శ్రీధర్
కళ్యాణ లక్ష్మి పథకానికి 12 ఏళ్లు.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
అనంతగిరి బస్సు ప్రమాదంపై ఎమ్మెల్యే జిఎంఆర్ తీవ్ర విచారం