క్రీడలతో శారీరక ఆరోగ్యం.. మానసిక ఉల్లాసం.. క్రమశిక్షణ
- చదువుతో పాటు క్రీడలపైనా ఆసక్తి పెంచుకోవాలి: మంత్రి జూపల్లి
కొల్లాపూర్ : క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని.. క్రీడల ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందే అవకాశం ఉంటుందని చెప్పారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని ఎల్లూరులో క్రీడా మైదానం అభివృద్ధి పనులకు శనివారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ, ప్రతిభావంతులైన క్రీడాకారులు మారుమూల ప్రాంతాలకే పరిమితం కాకుండా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పాల్గొని ప్రతిభను చాటాలని మంత్రి సూచించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కోసం రోజుకు కనీసం ఒక గంట వ్యాయామానికి కేటాయించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా వసతులను మెరుగుపరిచి యువతలోని ప్రతిభను వెలికితీసేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

