టీఎన్జీవో భవన్‌లో ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు
మంచిర్యాల టౌన్: జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను పురస్కరించుకొని మంచిర్యాల టీఎన్జీవో భవన్‌లో ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి అందించిన సేవలు వెలకట్టలేనివని అన్నారు. వారు చూపిన సత్యం, అహింస, దేశభక్తి, నిబద్ధత మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. వారి ఆశయాలను నేటి తరానికి తెలియజేస్తూ దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్ కుమార్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్నమల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు, ఉపాధ్యక్షులు తిరుపతి, బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షులు వెంకటేష్, మంచిర్యాల యూనియన్ ఉపాధ్యక్షులు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


