బాల్కొండ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బస్వా లక్ష్మినర్సయ్య 

బాల్కొండ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బస్వా లక్ష్మినర్సయ్య 

నిజామాబాద్ : పాత్రికేయ సమావేశం పెట్టి మాట్లాడుతూ దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చినా.. తెలంగాణకు మాత్రం మరో 13 నెలల పాటు నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల నెత్తుటి పంజా నుంచి విముక్తి దక్కలేదు. దేశమంతా మువ్వన్నెల జెండాతో సంబరాలు చేసుకుంటుంటే.. తెలంగాణ ప్రజలు మాత్రం రజాకార్ల మారణకాండలో నరకయాతన అనుభవించారు. నిజాం సంపద వెనుక తెలంగాణ రైతుల రక్తం, చెమట ఉంది. పన్నుల పేరుతో ప్రజలను పీల్చిపిప్పి చేస్తూ.. ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే నిజాం మాత్రం గడీల్లో విలాసవంతమైన జీవితం గడిపాడు. కాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్లు బలవంతపు మతమార్పిడులు, గ్రామాల దహనం, దోపిడీలు, హత్యలు, హిందూ ఆచారాలపై దాడులతో తెలంగాణలో భయానక వాతావరణం సృష్టించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ నరమేధం సాగించారు. పరకాల ఘటన రజాకార్ల క్రూరత్వానికి నిదర్శనం. మువ్వన్నెల జెండా ఎగరేయడానికి సిద్ధమైన నిరాయుధ దేశభక్తులపై రజాకార్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపి వందలాది మందిని పొట్టనపెట్టుకున్నారు. అందుకే పరకాలను తెలంగాణ జలియన్‌వాలాబాగ్‌గా పిలుస్తారు.నిర్మల్ గడ్డపై రాంజీ గోండ్‌తో పాటు వెయ్యి మంది ఆదివాసీ యోధులను నిజాం సైన్యాలు ఒకే మర్రిచెట్టుకు ఉరితీశాయి. చరిత్రలో నిలిచిన ‘వెయ్యి ఊడల మర్రి’ తెలంగాణ వీరుల త్యాగానికి నిలువెత్తు సాక్ష్యం. బైరాన్‌పల్లిలో రజాకార్ల పైశాచికత్వం పరాకాష్టకు చేరింది. గ్రామాన్ని కాపాడుకునేందుకు పోరాడిన 90 మందికి పైగా గ్రామస్థులను హతమార్చడంతో పాటు.. మహిళలు, చిన్నారులపై కూడా దారుణాలకు పాల్పడ్డారు. అక్కడి అమరధామం నేటికీ ఆ రక్తచరిత్రను గుర్తుచేస్తోంది. రజాకార్ల నరమేధాన్ని ఆపేందుకు ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్ణయాత్మకం గా రంగంలోకి దిగారు. 1948 సెప్టెంబర్ 13న ఆపరేషన్ పోలో ప్రారంభమై.. భారత సైన్యం తాకిడికి కేవలం ఐదు రోజుల్లోనే నిజాం సైన్యం లొంగిపోయింది. 1948 సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో మహత్తరమైన విమోచన దినం. నిజాం లొంగిపోయి హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావడంతో తెలంగాణ ప్రజలు నిజాం-రజాకార్ల సంకెళ్ల నుంచి విముక్తి పొంది భారతావనిలో అంతర్భాగమయ్యారు. ఇంతటి మహోజ్వల విమోచన చరిత్రను కాంగ్రెస్ పాలకులు చరిత్ర పుటల్లో తగిన స్థానం ఇవ్వకుండా పక్కనపెట్టారు. మైనారిటీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తెలంగాణ అమరవీరుల త్యాగాలను విస్మరించారు. నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ‘ప్రజాపాలన దినోత్సవం’ పేరుతో సెప్టెంబర్ 17 విమోచన చరిత్రను మరుగునపరుస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం మాట తప్పారు. ఎంఐఎం మెప్పు కోసం ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం’ పేరుతో అసలు విమోచన చరిత్రను పక్కకు నెట్టారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ పేర్లు వేరైనా.. మజ్లిస్ విషయంలో వారి రాజకీయ వైఖరి ఒక్కటే. ఓట్ల కోసం ఎంఐఎంను ప్రసన్నం చేసుకోవడం కోసం తెలంగాణ విమోచన చరిత్రను, అమరవీరుల త్యాగాలను పక్కనపెట్టారు. నిన్న కేసీఆర్ కారు స్టీరింగ్‌ను మజ్లిస్ చేతిలో పెడితే.. నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే రాజకీయాన్ని కొనసాగిస్తోంది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని దశాబ్దాలుగా పోరాడింది బీజేపీ. ఎల్.కె. అద్వానీ నుంచి చెన్నమనేని విద్యాసాగర్‌రావు, బండారు దత్తాత్రేయ, ఇంద్రసేనారెడ్డి తదితర నాయకుల వరకు లాఠీ దెబ్బలు, జైళ్లను సైతం లెక్కచేయకుండా ఈ పోరాటాన్ని కొనసాగించారు. పాలకుల నిర్లక్ష్యానికి ముగింపు పలుకుతూ.. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2022 సెప్టెంబర్ 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తొలిసారి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించింది. అప్పటి నుంచి ప్రతి ఏటా ఈ చారిత్రక దినాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. తెలంగాణ విమోచన పోరాటం ఒక్క మతానికి చెందినది కాదు.. భారతదేశం కోసం జరిగిన మహత్తర పోరాటం. తుర్రేబాజ్ ఖాన్, షోయబుల్లా ఖాన్, వందేమాతరం రామచంద్రరావు వంటి దేశభక్తులతో పాటు.. కొమురం భీమ్, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, స్వామి రామానంద తీర్థ తదితరుల త్యాగాలు తెలంగాణ విమోచన చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయి. ఇది విలీనం, సమైక్యత లేదా పేర్ల మార్పు కోసం జరిగిన పోరాటం కాదు.. రజాకార్ల నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు లభించిన విమోచనం. పరకాల వీరుల రక్తం, బైరాన్‌పల్లి ఆడబిడ్డల కన్నీళ్లు, నిర్మల్ వెయ్యి ఊడల మర్రి సాక్షిగా సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా సగర్వంగా జరుపుకుందాం. నిజాం-రజాకార్ మనస్తత్వానికి తావులేని తెలంగాణ కోసం అమరవీరుల ఆశయాలను ముందుకు తీసుకెళ్దాంఅన్నారు . ఈ కార్యక్రమం లో బీజేపీ జిల్లాప్రధానకార్యదర్శి నిమ్మల శ్రీనివాస్, బాల్కొండ అసెంబ్లీ కన్వీనర్ మల్కాన్నగారి మోహన్, బాల్కొండ మండల అధ్యక్షులు అంబటి నవీన్, కిసాన్ మోర్చా మం, అధ్యక్షులు ఆరెపల్లి నర్సయ్య, కిసాన్ మోర్చా జిల్లా ప్రధానకార్యదర్శి ముస్కు నర్సయ్య, ఉపాధ్యక్షులు తోట చిన్నయ్య, నాయకులు ముస్కు భూమేశ్వర్, లింగాగౌడ్,దినేష్, సత్యనారాయణ, లింగం, రాంకిషన్, బీజేపీ, కిసాన్ మోర్చా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

నాగులపహాడ్‌లో వెల్లివిరిసిన  దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు నాగులపహాడ్‌లో వెల్లివిరిసిన  దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు
పెన్ పహాడ్, ( సూర్యాపేట): సూర్యాపేట నియోజకవర్గ వికాసానికి అహర్నిశలు శ్రమించిన ప్రజానేత, మాజీ మంత్రివర్యులు ‘టైగర్’ రాంరెడ్డి దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు పెన్ పహాడ్మండల...
అనాజిపురంలో  దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు
దోసపహాడ్‌లో ఘనంగా  రాంరెడ్డి దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు
ఉచిత మట్టి గణపతుల పంపిణీ
లచ్చునాయక్ ని పరామర్శించిన బుసిరెడ్డి పాండురంగారెడ్డి..
సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్న హమారా  ప్రసాద్ పై దేశద్రోహం కేసు పెట్టాలి.
వినాయక చవితి పండగ శుభాకాంక్షలు తెలిపిన పోచారం.