ఇంటి ఆవరణలోని బాత్రూమ్ వెనుక మృతదేహం..!

ఇంటి ఆవరణలోని బాత్రూమ్ వెనుక మృతదేహం..!

భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామానికి చెందిన హరిణి (18) అనే యువతి అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. తమ ఇంటి ఆవరణలోని బాత్రూమ్ వెనుక తన కుమార్తె మృతదేహం కనపడటం తో పక్కింటి వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడని మృతురాలి తల్లి ఆరోపిస్తోంది. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో హరిని నర్సింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నట్లు సమాచారం. హరని తండ్రి మరణించడంతో కూలి పనులు చేసి తన ఇద్దరు కూతుళ్లను తల్లి రాజేశ్వరి చదివిస్తోంది. సెలవుల నేపథ్యంలో ఇటీవలే   హరిణి ఇంటికి వచ్చింది. కాగా హరని తల్లి అదే గ్రామంలోని చుట్టాల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి హరిణి కనిపించడంలేదని వెతికిన తల్లికి, ఒంటిపై గాయాలతో బాత్రూమ్ వెనుక హరిణి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.  దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Views: 13

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

బిజిలీపూర్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ బిజిలీపూర్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
శివంపేట(మెదక్): మెదక్ జిల్లా శివంపేట మండలం బిజిలీపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కుక్కల పెంటమ్మ అధ్యక్షతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా...
ఆదిలాబాద్ రిమ్స్‌ ఆస్పత్రిని సందర్శించిన  టీ ఆర్ ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత 
మహా అన్నదానం 
మహా గణపతికి కుంకుమార్చన పూజ నిర్వహించిన తేజోమయి రెసిడెన్సి మహిళలు.
బోధన్ లో పసుపు వాగు వద్ద గణేష్ నిమజ్జన బందోబస్తు
మర్రిగూడ ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా పోషణ మాసం 
వాడివేడిగా మర్రిగూడ మండల సర్వసభ్య సమావేశం!