డీజేలకు అనుమతి లేదు: నాంపల్లి ఎస్సై
నాంపల్లి: గణనాథుల నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని నాంపల్లి ఎస్సై లింగారెడ్డి సూచించారు. నేడు జరిగే నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిర్వాహకులు, భక్తులు పోలీసులకు సహకరించాలని కోరారు. నిమజ్జన ఊరేగింపులో డీజేలకు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్సై స్పష్టం చేశారు. గణనాథుల శోభాయాత్రను క్రమశిక్షణతో నిర్వహిస్తూ, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూడాలని సూచించారు. యువత సంయమనం పాటించి, భక్తిశ్రద్ధలతో గణనాథుని నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని ఎస్సై కోరారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


