మహా గణపతికి కుంకుమార్చన పూజ నిర్వహించిన తేజోమయి రెసిడెన్సి మహిళలు.
హన్మకొండ న్యూస్ : హనుమకొండ హంటర్ రోడ్ నంది హిల్స్ లోని తేజోమయి రెసిడెన్సి ఆవరణలో మంగళవారం రోజు సాయంత్రం మహిళలు అందరూ కలిసి మహాగణపతికి కుంకుమ పూజను నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని మహాగణపతికి శ్రీ లక్ష్మీ గణపతి కుంకుమార్చన పూజలు నిర్వహించి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండే విధంగా మహాగణపతి ఆశీర్వాదాలు ఉండే విధంగా భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో తేజోమయి అపార్ట్మెంట్ అధ్యక్షులు రామచంద్రారెడ్డి ,కార్యదర్శి రమేష్ రెడ్డి తో పాటు అపార్ట్మెంట్ సభ్యులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


