మెదక్ జిల్లా స్కూల్ గేమ్స్‌లో రసవత్తరంగా ఖో-ఖో పోటీలు
మెదక్ : మెదక్ జిల్లా స్కూల్ గేమ్స్‌లో భాగంగా ఖో-ఖో అండర్-14, అండర్-17 బాలికల విభాగాల పోటీలు మంగళవారం వెస్లీ గ్రౌండ్ లో రసవత్తరంగా నిర్వహించారు. వివిధ పాఠశాలలకు చెందిన క్రీడాకారిణులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. పోటీలు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెదక్ జిల్లా యోగా సీనియర్ అధ్యక్షుడు కర్ణం గణేష్ రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారిణులను ప్రోత్సహిస్తూ క్రీడల ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మెదక్ జిల్లా సెక్రటరీ ఆర్ నాగరాజు, శ్రీకాంత్ గౌడ్, మాధవరెడ్డి,ఆర్ శ్రీధర్ రెడ్డి, మధు, నరేష్, పి రమేష్, లక్ష్మణ్ ప్రభాకర్ తెలంగాణ ఆదర్శ పాఠశాల పీడీలు గజేంద్రుల నర్సింలు, బస్వరాజు పుష్ప వాణి, అశోక్, నాగరాజు, కృష్ణ, కేజీబీవీ పీఈటీలు తదితరులు పాల్గొన్నారు. క్రీడాకారిణులు క్రీడాస్ఫూర్తితో పోటీల్లో పాల్గొని ఆకట్టుకున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


