జిల్లాస్థాయిలో యువ సంస్కృతి వారసత్వ పోటీల్లో బాలుర ప్రభుత్వ కళాశాల విద్యార్థుల ప్రతిభ
హుస్నాబాద్ : యువ సంస్కృతి వారసత్వ జిల్లా స్థాయి పోటీల్లో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ బాలుర కళాశాల విద్యార్థుల ప్రతిభ కనపరిచారు.ఈ సందర్బంగా జిల్లా కేంద్రంలోని టీచర్స్ ట్రైనింగ్ మరియు రిసోర్స్ సెంటర్ లో జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రోజున నిర్వహించిన యువ సంస్కృతి వారసత్వ జిల్లా స్థాయి పోటీలలో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొని ఐదు విభాగాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచారు.ఈ పోటీలలో షార్ట్ ఫిల్మ్ , స్కిట్ , పిపిటి, ప్రజెంటేషన్, ప్రేమిసెస్, క్లీనింగ్,హెరిటేజ్ వాక్ అనే ఐదు అంశాల్లో హుస్నాబాద్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.ప్రత్యేకంగా హుస్నాబాద్ ప్రాంతంలోని పర్యాటక, చారిత్రక మరియు వారసత్వ ప్రదేశాలను కేంద్రంగా చేసుకుని విద్యార్థులు తమ ప్రదర్శనలు రూపొందించారు. హుస్నాబాద్ ప్రాంతానికి ఉన్న చారిత్రక ప్రాధాన్యత, స్థానిక పర్యాటక ప్రదేశాలు, వారసత్వ సంపద, వాటి పరిరక్షణ ఆవశ్యకతను విద్యార్థులు చక్కగా వివరించారు.మరియు ప్రేమిసెస్ క్లీనింగ్ కార్యక్రమం ద్వారా పరిసరాల పరిశుభ్రత, పర్యాటక ప్రదేశాల పరిశుభ్రత మరియు వారసత్వ ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యతపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ,మన హుస్నాబాద్ ప్రాంతంలోని చారిత్రక, పర్యాటక మరియు వారసత్వ ప్రదేశాలను మనం తెలుసుకోవడమే కాకుండా, వాటి ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేసి, భవిష్యత్ తరాల కోసం వాటిని పరిరక్షించాలని సందేశాన్ని అందించారు. ప్రభుత్వ బాలుర కళాశాల హుస్నాబాద్ విద్యార్థుల ప్రతిభను జిల్లా స్థాయిలో కొనియాడారు.కళాశాల ప్రిన్సిపాల్ చెన్నూరి గంగాధర్ విద్యార్థులను అభినందిస్తూ, విద్యార్థులు విద్యతో పాటు స్థానిక చరిత్ర, సంస్కృతి, పర్యాటకం మరియు వారసత్వ పరిరక్షణపై అవగాహన పెంపొందించుకోవడం అభినందనీయమని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను అధ్యాపకులు అభినందించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


