నాగులమ్మ చెరువును సర్పంచ్ ఆధ్వర్యంలో పరిశీలించిన ఎస్సై
నాంపల్లి: నేడు జరిగే గణేష్ నిమజ్జన కార్యక్రమం కోసం జిల్లా కలెక్టర్ నాగులమ్మ చెరువును నిమజ్జన ప్రదేశంగా గుర్తించిన నేపథ్యంలో బుధవారం నాంపల్లి ఎస్సై లింగారెడ్డి సర్పంచ్ నక్క చంద్రశేఖర్ ఆధ్వర్యంలో చెరువును పరిశీలించారు.నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. చెరువు వద్ద నిమజ్జన సమయంలో భద్రతా చర్యలు, విద్యుత్ సౌకర్యం, వెలుతురు, రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలను పరిశీలించారు. గణేష్ విగ్రహాల నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరిగేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్సై సూచించారు. భక్తులు పోలీసులకు సహకరించి నిమజ్జన కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ఉప సర్పంచ్ పానగంటి నిర్మల వెంకటయ్య,వార్డు సభ్యులు నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


