హన్మకొండ కనకదుర్గ కాలనీలో, అంబేద్కర్ సర్కిల్ లో

ఘనంగా వినాయక చవితి వేడుకలు.

హన్మకొండ కనకదుర్గ కాలనీలో, అంబేద్కర్ సర్కిల్ లో

హన్మకొండ కనకదుర్గ కాలనీలో, అంబేద్కర్ సర్కిల్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు....

హన్మకొండ న్యూస్   :వినాయక చవితి పండుగను పురస్కరించుకుని హన్మకొండలోని కనకదుర్గ కాలనీలో మరియు అంబేద్కర్ సర్కిల్ లో ఏర్పాటు చేసిన గణపతి మండపాలలో విఘ్నేశ్వరుని పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి , వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి  విఘ్నేశ్వరునికి నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే కడియం శ్రీహరి  మాట్లాడుతూ... నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. బొజ్జ గణపయ్య కృపాకటాక్షాలతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అలాగే, కాలనీవాసులు, నగర ప్రజలు ప్రతి ఏటా ఐక్యమత్యంతో, ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా ఈ ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. అలాగే మట్టి వినాయక విగ్రహాలనే పూజించి పర్యావరణాన్ని కాపాడాలని కడియం శ్రీహరి  కోరారు. భక్తులందరూ పండుగను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య, సోదరభావంతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారవు, వినాయక ఉత్సవ కమిటీ ప్రతినిధులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కాలనీవాసులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

నాగులపహాడ్‌లో వెల్లివిరిసిన  దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు నాగులపహాడ్‌లో వెల్లివిరిసిన  దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు
పెన్ పహాడ్, ( సూర్యాపేట): సూర్యాపేట నియోజకవర్గ వికాసానికి అహర్నిశలు శ్రమించిన ప్రజానేత, మాజీ మంత్రివర్యులు ‘టైగర్’ రాంరెడ్డి దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు పెన్ పహాడ్మండల...
అనాజిపురంలో  దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు
దోసపహాడ్‌లో ఘనంగా  రాంరెడ్డి దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు
ఉచిత మట్టి గణపతుల పంపిణీ
లచ్చునాయక్ ని పరామర్శించిన బుసిరెడ్డి పాండురంగారెడ్డి..
సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్న హమారా  ప్రసాద్ పై దేశద్రోహం కేసు పెట్టాలి.
వినాయక చవితి పండగ శుభాకాంక్షలు తెలిపిన పోచారం.