భక్తులకు మట్టి వినాయక ప్రతిమల ఉచిత పంపిణీ
బెల్లంపల్లి మంచిర్యాల జిల్లా: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని బెల్లంపల్లి కాంట చౌరస్తాలో భక్తులకు మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామితో కలిసి మున్సిపల్ చైర్‌పర్సన్ దావ స్వాతి–రమేష్‌బాబు భక్తులకు ప్రతిమలను అందజేశారు.పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక ప్రతిమలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. మట్టి ప్రతిమలను ఉపయోగించడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మట్టి వినాయక ప్రతిమలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ కారుకూరి రాంచందర్, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


