నిర్మల్ పోలీస్... మీ పోలీస్

అధికారులు, సిబ్బందికి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిన జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్....

 
IMG-20251210-WA0006(1)

నిర్మల్:   రేపు జిల్లాలో జరుగనున్న మొదటి విడత పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని రకాల భద్రతా చర్యలను పకడ్బందీగా చేపట్టామని జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మామడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన బందోబస్తు స్కీమ్ ను ఉద్దేశించి మాట్లాడుతూ....

        పోలీసు అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక దిశానిర్దేశాలు జారీ చేశారు. ప్రతి గ్రామంలో శాంతిభద్రతలు క్షుణ్ణంగా పర్యవేక్షించేలా బలగాల నియోజకవర్గాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల కేంద్రాల వద్ద క్రిటికల్, సాధారణ, అత్యంత సున్నిత ప్రాంతాలుగా గుర్తించి, అదనపు బలగాలను మోహరించినట్లు వివరించారు.ఎన్నికల సమయంలో ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు తావు ఇవ్వకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టంచేశారు. ప్రజలు, అభ్యర్థులు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

       జిల్లాలోని అన్ని పోలీసు అధికారులకు, బందోబస్తు సిబ్బందికి తమ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని, ప్రజాస్వామ్య పండుగ అయిన ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించే దిశగా కట్టుదిట్టంగా పని చేయాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ డా జి జానకి షర్మిల ఐపీఎస్ తో పాటు అడిషనల్ ఎస్పీ ఉపేందర్ రెడ్డి,భైంసా ఏ ఎస్పీ రాజేష్ మీన ఐపీఎస్, ఇన్స్పెక్టర్లు, ఆర్ ఐ లు, ఎస్ఐ లు, ఆర్ ఎస్ ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు.

Views: 17

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

జీవో నెంబర్ 97 రద్దుచేసి పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి జీవో నెంబర్ 97 రద్దుచేసి పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి
హుస్నాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థకు సంబంధించిన జీవో నంబర్ 97 ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఏబీవీపీ నగర కార్యదర్శి బత్తుల...
బోడు, లచ్చగూడెంలో ఘనంగా వనమహోత్సవం
నేత్రదానం చేయండి-చిరంజీవి గా జీవించండి
ప్రజా సంక్షేమ డిమాండ్లను వెంటనే అమలు చేయాలి: TMRPS
విద్యార్థుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలి
లింగాపూర్ గ్రామ ఒక పెద్దయన ను కాదు ఒక తరాన్ని కోల్పోయినట్లు కాదు మగ్రే శంకర్
మొక్కల పెంపకంతో పచ్చని భవిష్యత్తుకు బాటలు