కాజీపేట దర్గా ఉర్సు ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి.
హన్మకొండ: ప్రపంచంలోనే మత సామరస్యానికి, సమైక్యతకు కాజీపేటలోని హజరత్ సయ్యద్ షా అఫ్జల్ బియాబానీ దర్గా ప్రసిద్ధి చెందిందని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. హజరత్ సయ్యద్ షా అఫ్జల్ బియాబానీ దర్గాను దర్గా పీఠాధిపతి జనాబ్ (సయ్యద్ గులాం అఫ్జల్ బియాబాని) ఖుస్రూ పాషాతో కలిసి దర్శించుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ ఉర్సు ఉత్సవాలలో అన్ని మతాల వారు పాల్గొనడం సర్వమత ఐక్యతకు నిదర్శనం అని పేర్కొన్నారు. కుల మతాలకు అతీతంగా ప్రజలంతా సోదరాబావంతో కలిసి మెలిసి ఉండేందుకు ఈ ఉర్సు ఉత్సవాలు ప్రతీకగా నిలుస్తాయని అన్నారు. కాజీపేట దర్గా ఉర్సు ఉత్సవాలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుండే కాకుండా విదేశాల నుండి కూడా భక్తులు రావడం దర్గా విశిష్టతకు నిదర్శనం అని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Views: 2
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
12 Aug 2026 16:06:22
చేగుంట : మెదక్ జిల్లా చేగుంట నుండి మెదక్ వెళ్లే హైవేలో రైతులు బైఠాయించి యూరియా యాప్ ను ఎత్తివేయాలి అని పొలంపల్లి చౌరస్తా లో పొలంపల్లి...
