వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ
నారాయణ పేట జిల్లా, మక్తల్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశానుసారం విసిఐ ( వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మక్తల్ పట్టణంలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు పండ్లు బెడ్లు పంపిణీ అలాగే సాధన క్లినిక్, మనయ్య పొలి క్లినిక్,వెంకటరమణ పాలి క్లినిక్ నందు రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది. వాసవి క్లబ్ అధ్యక్షుడు మాట్లాడుతూ.. జిల్లా వి 108 ఏ గవర్నర్ మరియు రీజియన్ చైర్మన్ , జోన్ చైర్మన్ వారి సలహాలు సూచనలతో ఇట్టి కార్యక్రమాలు చేస్తున్నామని అలాగే ఆలయ కమిటీ చైర్మన్ కొత్త శ్రీనివాస్ గుప్త, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు బి.భాస్కర్,మక్తల్ మాజీ డిప్యూటీ గవర్నర్లు కల్వ శ్రీనివాస్, దొంత నరహరి, కట్టా సురేష్, ఆర్యవైశ్య సంఘం పెద్దలు, యువజన సంఘం,వాసవి క్లబ్ వారి సహాయ,సహకారం, సూచనలతో వాసవి క్లబ్ సేవలు మరింత బలోపేతం చేస్తామని, మునుముందు కూడా కార్యక్రమాలు వాసవి మాత ఆశీర్వాదంతో మక్తల్ పట్టణ పరిసర ఆర్యవైశ్యులు అందరి సహకారంతో చేస్తామని ప్రతి ఒక్కరూ కార్యక్రమాలలో పాలు పంచుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షుడు మేడిశెట్టి హరికృష్ణ, కార్యదర్శి కొత్త ఆంజనేయులు, డాక్టర్ ప్రహ్లాద్, డాక్టర్ రాము,డాక్టర్ అనిల్ కుమార్ గౌడ్, రాష్ట్ర మెడికల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కొండ విజయకుమార్, ఆస్పత్రి డాక్టర్లు, సిబ్బంది, పేషెంట్లు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


