విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు పంపిణీ
బ్రిలియంట్ స్కూల్ యాజమాన్యం సహకారంతో సరస్వతి మాత విగ్రహా కట్ట ఏర్పాటుకు జిల్లా గవర్నర్ చే భూమి పూజ
మక్తల్ : మక్తల్ పట్టణ కేంద్రంలో మక్తల్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో బ్రిలియంట్ స్కూల్ నందు వాసవి క్లబ్ జిల్లా వి 108 గవర్నర్ అధికారిక పర్యటనలో భాగంగా.. మొదటగా సరస్వతి మాత ఫోటోకు ముఖ్య అతిథి గవర్నర్ అతిథులు రీజన్ చైర్మన్, సెక్రెటరీ, జెడ్ సి , వాసవి క్లబ్ సభ్యులచే పూజ చేసిన, అనంతరం జిల్లా గవర్నర్ గోల్డెన్ స్టార్ కేసీజిఎఫ్ కల్మచర్ల రమేష్ సార్ చేతుల మీదుగా బ్రిలియంట్ స్కూల్ యాజమాన్యం వారి సహకారంతో సరస్వతి విగ్రహానికి కట్ట చేయుట కోసం భూమి పూజ చేయడం జరిగింది. అలాగే ముఖ్య అతిథి జిల్లా వి 108 ఏ గవర్నర్ గోల్డెన్ స్టార్ కె సి జి ఎఫ్ కల్మచర్ల రమేష్, అతిథులు రీజియన్ చైర్మన్ ప్రతిభా సంకల్పం కే సి జి ఎఫ్ శ్రీకర్ నాగ సావిత్రి, రీజన్ సెక్రెటరీ నీలకాంత్, జెడ్ సి బెండె సత్యవతి, ప్రిన్సిపల్ సుజిత రెడ్డి గారిచే విద్యార్థిని విద్యార్థులకు నోట్బుక్కులు, పెన్నులు పెన్సిళ్లు రబ్బరులు మాగనూరు ఆర్యవైశ్య సంఘం సభ్యులచే, అలాగే ముఖ్య అతిథి, అతిథులు,మక్తల్ మాజీ డిప్యూటీ గవర్నర్లు, వాసవి క్లబ్ అధ్యక్ష, కార్యదర్శి,కోశాధికారి సభ్యులచే విద్యార్థిని విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ గవర్నర్ కల్వ శ్రీనివాస్,కాబినెట్ నాగరాజు,మాజీ కె సి జి ఎఫ్ అధ్యక్షులు బిలకంటి నర్సయ్య, బిలకంటి జగదీశ్, ప్రిన్సిపల్ సుజిత రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ వెంకట్రామిరెడ్డి, పిఈటి బాలరాజ్, వాసవి క్లబ్ అధ్యక్షుడు మేడిశెట్టి హరికృష్ణ, కార్యదర్శి కొత్త ఆంజనేయులు, తాళంపల్లి పవన్ కుమార్,పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


