గిరిజన చెంచు సమస్యలపై ప్రజావాణి కార్యక్రమం ప్రారంభం

గిరిజన చెంచు సమస్యలపై ప్రజావాణి కార్యక్రమం ప్రారంభం

  • అచ్చంపేట ప్రాజెక్టు అధికారి ఐటిడిఎ చెంచు నూతన పిఓ, సబ్ కలెక్టర్ సలోన చోప్రా
  • ప్రజావాణి కార్యక్రమంలో 33 దరఖాస్తులు స్వీకరణ
  • ముఖ్యంగా తాగునీరు, కరెంటు, రోడ్ల కోసం వినతులు
  • రేషన్, ఆధార్ కార్డులు.. ఇందిరమ్మ ఇళ్ల కోసం డిమాండ్
  • సమస్యల పరిష్కారానికి చర్యలు పీఓ, సబ్ కలెక్టర్ సలోన చోప్రా

మన్ననూరు : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని ఐటిడిఎ ఆధ్వర్యంలో చెంచు ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రతి మంగళవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి 33 దరఖాస్తులు అందాయి. తాగునీరు, బోర్లు, కరెంటు సమస్యలు పరిష్కరించాలని ప్రజలు అధికారులను కోరారు. రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రోడ్డు సౌకర్యాలు కల్పించాలని గిరిజన, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు వినతులు సమర్పించారు. జీవనోపాధి కోసం మేకలు అందించాలని కొందరు కోరారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి, క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి సాధ్యమైన మేరకు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఐఏఎస్, పీఓ, ఐటీడీఏ సలోన చోప్రా తెలిపారు. చెంచు గ్రామాల్లో అవసరమైన మౌలిక వసతులను గుర్తించి, అందుబాటులో ఉన్న వనరులతో సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఎస్‌ఎస్‌జీ ద్వారా సహాయం అందించే అంశాల్లోనూ సహకారం అందిస్తామని తెలిపారు. చెంచు ప్రజలు ప్రతి మంగళవారం మన్ననూరు ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణిలో తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తెలియజేయాలని సూచించారు.

Views: 8

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News