వరంగల్ విమానాశ్రయానికి సేవాలాల్ మహారాజ్ పేరు పెట్టాలి
జీవీఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్ర ప్రవీణ్ నాయక్ విజ్ఞప్తి,
మేడ్చల్ మల్కాజ్గిరి: వరంగల్‌లో నిర్మాణం కానున్న విమానాశ్రయానికి ప్రపంచ బంజారా, గిరిజన సమాజాల ఆధ్యాత్మిక మార్గదర్శకులు, మహాగురు సేవాలాల్ మహారాజ్ పేరును పెట్టాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ని జీవీఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్ర ప్రవీణ్ నాయక్ కోరారు. బంజారా సమాజానికి మహాగురు సేవాలాల్ మహారాజ్ అందించిన ఆధ్యాత్మిక, సామాజిక సేవలు చిరస్మరణీయమని, ఆయన పేరును వరంగల్ విమానాశ్రయానికి పెట్టడం ద్వారా బంజారా, గిరిజన సమాజాల గౌరవాన్ని మరింత పెంచినట్లవుతుందని ఆయన పేర్కొన్నారు. వరంగల్ విమానాశ్రయం ఉత్తర తెలంగాణకు కీలకమైన రవాణా కేంద్రంగా అభివృద్ధి చెందనుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయడం, వరంగల్ చరిత్ర–సంస్కృతికి ప్రతిబింబంగా ఉండేలా రూపకల్పన చేయడం వంటి అంశాలపై దృష్టి సారిస్తున్నట్లు ప్రకటించింది. అందువల్ల వరంగల్ విమానాశ్రయానికి మహాగురు సేవాలాల్ మహారాజ్ విమానాశ్రయం అనే పేరు పెట్టే అంశాన్ని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించాలని కొర్ర ప్రవీణ్ నాయక్ విజ్ఞప్తి చేశారు. మహాగురు సేవాలాల్ మహారాజ్ గారి పేరు ఒక విమానాశ్రయానికి పెట్టడం ద్వారా బంజారా జాతి చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మిక వారసత్వం భవిష్యత్ తరాలకు చిరస్థాయిగా గుర్తుండేలా చేయాలి” అని ఆయన కోరారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


