విద్యార్థుల రీడింగ్ సామర్థ్యాలను అంచనా వేయాలని,ఉపాధ్యాయులకు సూచన.
నాణ్యమైన విద్య అందించేందుకు సమిష్టిగా కృషి చేయాలని పిలుపు.: డీఈఓ సుసింధర్ రావు.
నాగార్జునసాగర్; పెద్దవూర మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెల్మగూడెం,ప్రాథమిక పాఠశాల వెల్మగూడెం, పెద్దగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) సుసింధర్ రావు దర్శనం భోజనాన్ని గురువారం సందర్శించి ఎఫ్‌ఎల్‌ఎన్ కార్యక్రమం అమలు తీరును పరిశీలించారు.ఈ సందర్భంగా విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడిన డీఈవో సుసింధర్ రావు ,వారి చదవడం,రాయడం,గణిత నైపుణ్యాలను పరీక్షిస్తూ రీడింగ్ సామర్థ్యాలను అంచనా వేశారు.విద్యార్థులు పాఠ్యాంశాలను ఎంత మేరకు అర్థం చేసుకుంటున్నారో తెలుసుకోవడంతో పాటు,ఉపాధ్యాయులు అనుసరిస్తున్న బోధనా విధానాలపై ఆరా తీశారు.అనంతరం ఉపాధ్యాయులకు పలు సూచనలు చేస్తూ,ప్రతి విద్యార్థి ప్రాథమిక అక్షరాస్యత,సంఖ్యాజ్ఞానంలో నిర్దేశిత లక్ష్యాలను చేరుకునేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.విద్యార్థుల్లో చదివే అలవాటు పెంపొందించేందుకు ప్రతిరోజూ రీడింగ్ కార్యక్రమాలు నిర్వహించాలని,వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందించాలని ఆదేశించారు.అలాగే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రికార్డులు,హాజరు వివరాలు,తరగతి గది బోధనను పరిశీలించిన డీఈవో,నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యా యులు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయుని-ఉపాధ్యాయులు, విద్యార్థిని-విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


