గణేష్ ఉత్సవాలకు ఈఎల్వీ ఫౌండేషన్ ఉదారత

గణేష్ ఉత్సవాలకు ఈఎల్వీ ఫౌండేషన్ ఉదారత

  • చెర్లగూడంలో గణనాథునికి ప్రత్యేక పూజలు
  • యువతకు అండగా ఉంటాం
  •  ఈఎల్వీ ఫౌండేషన్ అధినేత ఇరుగదిండ్ల భాస్కర్

నల్గొండ / మర్రిగూడ: వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మర్రిగూడ మండలం చెర్లగూడం గ్రామంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహ ఉత్సవ నిర్వాహకులకు ఈఎల్వీ ఫౌండేషన్ అండగా నిలిచింది. ఫౌండేషన్ అధినేత  ఇరుగదిండ్ల భాస్కర్ ఉత్సవాల నిర్వహణకు ఆర్థిక సాయం అందించి, నిర్వాహకులకు పూర్తి ఆసరాగా నిలిచారు.ఈ సందర్భంగా మండల పరిధిలోని పలు గ్రామాల్లో యువత అత్యంతీ భక్తిశ్రద్ధలతో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను ఇరుగదిండ్ల భాస్కర్ తన బృందంతో కలిసి సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయా మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, తొలిపూజలందుకున్న గణనాథుని ఆశీస్సులు తీసుకున్నారు.ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ నేటి యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా, దైవభక్తితో పాటు సాంస్కృతిక కార్యక్రమాల వైపు ఆకర్షితులు కావడం అభినందనీయమన్నారు. గణేష్ ఉత్సవాలు కేవలం పూజలకే పరిమితం కాకుండా, గ్రామాల్లో ఐక్యతను పెంపొందించడానికి వేదిక కావాలని ఆకాంక్షించారు. ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో సంప్రదాయాలను కాపాడే యువతకు, పండుగల నిర్వహణకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీనిచ్చారు.ఈ కార్యక్రమంలో ఈఎల్వీ ఫౌండేషన్ సభ్యులు, స్థానిక యువకులు, గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అపర్ణ మాల్ లోని గణేష్ నిమర్జనం  అపర్ణ మాల్ లోని గణేష్ నిమర్జనం 
నిజామాబాద్  : నిజామాబాద్  నగరంలోని స్థానిక పద్మా నగర్ లో గల అపర్ణమాల్ లో ప్రతిష్టించిన గణపతిని భజన చేసుకుంటూ అందర్నీ ఆశ్చర్యపోయేలాగా అపర్ణ మాల్ కుటుంబ...
పలు కుటుంబాలను పరామర్శించి భరోసా కల్పించిన ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి
అల్లాదుర్గంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
యరుగండ్లపల్లిలో రికార్డు ధర పలికిన గణేశుడి లడ్డు
గణేష్ ఉత్సవాలకు ఈఎల్వీ ఫౌండేషన్ ఉదారత
సౌర విద్యుత్ ను సద్వినియోగం చేసుకోవాలి :ఎమ్మెల్యే కడియం శ్రీహరి
పరిశుభ్రతలో ప్రజల భాగస్వామ్యం అవసరం: సర్పంచ్