భక్తిశ్రద్ధలతో బోనాలు
- మద్దూరు బేడా బుడగ జంగం సభ్యులు
షాబాద్,(రంగారెడ్డి): షాబాద్ మండలంలోని మద్దూరు గ్రామపంచాయతీ పరిధిలోని పోచమ్మ తల్లి బోనాల పండుగను బేడా బుడగ జంగం సభ్యులు ఘనంగా నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి బోనాలు సమర్పించారు.ఈ సందర్భంగా 5వ వార్డు మెంబర్ కప్పెర రమేష్ మాట్లాడుతూ...గ్రామ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బేడా బుడగ జంగం కమిటీ సభ్యులు నాగుల మల్లేష్, కడమంచి శ్రీనివాస్, నాగుల దినకర్, నాగుల దాసు, మోటం ముత్తయ్య, కప్పెర దేవానంద్, నాగుల సన్నీ తదితరులు పాల్గొన్నారు.బోనాల పండుగ సందర్భంగా గ్రామంలో భక్తి వాతావరణం నెలకొంది.
Views: 3
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
10 Aug 2026 15:56:13
రేగోడ్ ,మెదక్ : రేగోడ్ మండల కేంద్రంలోని మక్త వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ కేశబోయిన రమేష్,సీనియర్ నాయకులు కురుమ సంగయ్య ,కొయ్యల మల్లయ్య కాంగ్రెస్...
