సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మహధర్నా

12వ వేతన ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలి మద్దతు తెలిపిన ఎమ్మెల్యే జీఎస్సార్

సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మహధర్నా

భూపాలపల్లి :  కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలి. సోమవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి జీఎం కార్యాలయం ముందు సింగరేణి జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన మహా ధర్నాలో  భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర  సత్యనారాయణ రావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ, 12వ జాతీయ బొగ్గుగని కార్మికుల వేతన ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని, అవి కార్మికుల హక్కులను కాలరాసే విధంగా ఉన్నాయని విమర్శించారు. ఈ నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బొగ్గు బ్లాకులను వేలం వేయడం వల్ల సింగరేణి సంస్థతో పాటు లక్షలాది మంది కార్మికుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని బొగ్గు బ్లాకులను వేలం ద్వారా కాకుండా నేరుగా సింగరేణి సంస్థకు కేటాయించాలని, కోయగూడెం ఓసీ-3 బొగ్గు గనిని కూడా సింగరేణికే అప్పగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.అదే సమయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కార్మికుల హక్కులను పరిరక్షించాల్సిన కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా అమలులో ఉన్న కార్మిక చట్టాలను రద్దు చేసి తీసుకొచ్చిన లేబర్ కోడ్లు అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేలా రూపొందించబడ్డాయని విమర్శించారు.సింగరేణి వంటి ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాలకు ప్రాధాన్యం ఇస్తూ బొగ్గు బ్లాకులను వేలం వేస్తోందని అన్నారు. ఈ విధానం వల్ల ప్రభుత్వ రంగ సంస్థలు బలహీనపడటమే కాకుండా కార్మికుల ఉపాధి భద్రత కూడా ప్రశ్నార్థకంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్మికుల హక్కులు, శ్రమ చట్టాలు, ట్రేడ్ యూనియన్ ఉద్యమాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. దేశ సంపదను కొద్దిమంది కార్పొరేట్ సంస్థల చేతుల్లో పెట్టే విధానాలను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. 12వ జాతీయ బొగ్గుగని కార్మికుల వేతన ఒప్పందాన్ని వెంటనే అమలు చేసి కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈ మహా ధర్నాలో ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్‌ఎంఎస్‌తో పాటు వివిధ కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Views: 9

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలో చేరిన యం.వెంకటపూర్ ఉప సర్పంచ్, సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలో చేరిన యం.వెంకటపూర్ ఉప సర్పంచ్, సీనియర్ నాయకులు
రేగోడ్ ,మెదక్ : రేగోడ్ మండల కేంద్రంలోని మక్త వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ కేశబోయిన రమేష్,సీనియర్ నాయకులు కురుమ సంగయ్య ,కొయ్యల మల్లయ్య కాంగ్రెస్...
డ్రైనేజీ పనులు త్వరగా పూర్తి చేయాలి 
మెదక్ బోడ్మట్‌పల్లి ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
జిల్లా బీజేపీకి కొత్త దిశ.. రమేష్‌కుమార్ సారథ్యం
ఘనంగా కాళీకాదేవి బోనాల ఉత్సవాలు.
పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ గద్దె కూల్చివేతపై ఫైర్‌
సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మహధర్నా