కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలో చేరిన యం.వెంకటపూర్ ఉప సర్పంచ్, సీనియర్ నాయకులు
రేగోడ్ ,మెదక్ : రేగోడ్ మండల కేంద్రంలోని మక్త వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ కేశబోయిన రమేష్,సీనియర్ నాయకులు కురుమ సంగయ్య ,కొయ్యల మల్లయ్య కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో గులాబీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఉప సర్పంచ్, సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలం చెందిందని అందుకే కాంగ్రెస్ పార్టీ ని విడిచిపెట్టి బిఆర్ఎస్ పార్టీ లోకి వెళ్తున్నామని అన్నారు.ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు యూరియా, కరెంట్ కష్టాలు, రైతులకు ఋణమాఫీ,తులం బంగారం అని ఇలా చెప్పుకుంటూ పోతే 420హామీలు నెరవేర్చకుండా అన్నివర్గాల ప్రజలను మోసం చేసిందని అన్నారు.తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వం బలపర్చాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వరం మాజీ చైర్మన్ వీరా రెడ్డి, రేగోడ్ మండల బిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శి సుంకే రమేష్, పిఏసిఎస్ చైర్మన్ రాజు యాదవ్,ఏయంసి మాజీ డైరెక్టర్ భూం రెడ్డి,మాజీ ఎంపిటిసి గొల్ల నర్సింలు, మాజీ సర్పంచ్ నర్సింలు,మండల సోషల్ మీడియా కన్వినర్ సంతోష్ రావు,నాయకులు అంజయ్య,గ్రామ అధ్యక్షులు షాదుల్,మండల సీనియర్ నాయకులు హన్మంతు,కుమ్మరి అంజయ్య,కిష్టయ్య, జైకుమార్,జనుముల సాయిలు,కాపు రవి,నాగరాజు,దాడే రాజు,జాళోజి మల్లేష్,మల్లేశం, దేవయ్య, కేశబోయి
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


