నివాసాల మధ్య బెల్ట్‌షాపు.. చర్యలు తీసుకోవాలి
- ఆర్‌పీగా పనిచేస్తూ బెల్ట్‌షాపు నిర్వహిస్తున్నారంటూ ఫిర్యాదు
- కమిషనర్‌కు 10వ డివిజన్ కార్పొరేటర్ వేల్పుల వీరమ్మ వినతి
కొత్తగూడెం : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 10వ డివిజన్ పరిధిలోని బూడిదగడ్డ బస్తీలో నివాస గృహాల మధ్య నిర్వహిస్తున్న బెల్ట్‌షాపును వెంటనే తొలగించి, నిర్వహిస్తున్న వ్యక్తిపై తగిన చర్యలు తీసుకోవాలని 10వ డివిజన్ కార్పొరేటర్ వేల్పుల వీరమ్మ కోరారు. బూడిదగడ్డ బస్తీలోని కె.కె. టవర్స్ సమీపంలోని నివాస ప్రాంతంలో MEPMA పరిధిలో రిసోర్స్ పర్సన్ (ఆర్‌పీ)గా విధులు నిర్వహిస్తున్న గుడ్ల ఉమ బెల్ట్‌షాపు నిర్వహిస్తున్నట్లు స్థానికుల నుంచి ఫిర్యాదులు అందాయని ఆమె తెలిపారు. బెల్ట్‌షాపునకు నిత్యం మద్యం సేవించేందుకు వచ్చే వ్యక్తుల కారణంగా మహిళలు, వృద్ధులు, చిన్నారులు, స్థానిక నివాసితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాల అభివృద్ధి, మహిళల సాధికారత కోసం పనిచేయాల్సిన ఆర్‌పీగా ఉంటూ నివాస గృహాల మధ్య బెల్ట్‌షాపు నిర్వహిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై అధికారులు సమగ్రంగా విచారణ జరపాలని కార్పొరేటర్ కోరారు. బెల్ట్‌షాపు నిర్వహణకు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు తేలితే వెంటనే దానిని తొలగించడంతో పాటు సంబంధిత వ్యక్తిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. డివిజన్ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తక్షణమే స్పందించాలని వేల్పుల వీరమ్మ కోరారు.
Views: 7
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
12 Aug 2026 16:06:22
చేగుంట : మెదక్ జిల్లా చేగుంట నుండి మెదక్ వెళ్లే హైవేలో రైతులు బైఠాయించి యూరియా యాప్ ను ఎత్తివేయాలి అని పొలంపల్లి చౌరస్తా లో పొలంపల్లి...
