500 మీటర్ల జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ

500 మీటర్ల జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ

బెల్లంపల్లి మంచిర్యాల :ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు బెల్లంపల్లి పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో 500 మీటర్ల భారీ జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ నిర్వహించారు. పట్టణ అధ్యక్షురాలు ధార కళ్యాణి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, తిరంగా ర్యాలీ పట్టణ ఇన్‌చార్జి అమురాజుల శ్రీదేవి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నేటి బాలలే రేపటి పౌరులని, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు కొండబాబు లక్ష్మీనారాయణ, కాసర్ల తిరుపతి, కొయ్యల ఏమాజీ, పులగం తిరుపతి, బుల్‌రెడ్డ్ల కేశవరెడ్డి, జిల్లా కార్యదర్శి రాచర్ల సంతోష్‌కుమార్, మధ్యర్ల శ్రీనివాస్, దూది ప్రకాష్, శనిగారపు శ్రావణ్, నర్సింగ్ గోమాస కమల, నల్లుల సంగీత, కళ్లపల్లి నవీన్, జీదుల రాములు, భాషబోయిన యుగేందర్, గంధం అనిల్, శ్రీనివాస్, ఓం సాయి సుఖ మల్లేష్, ఇప్ప స్వామి, షేక్ గౌస్‌బాబా, బాగ్మోహన్, గాండ్ల మహేష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Views: 85

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన యాప్ ద్వారా ఎరువులు కొనుగోలులు రైతులకు శాపంగా మారాయి  కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన యాప్ ద్వారా ఎరువులు కొనుగోలులు రైతులకు శాపంగా మారాయి 
చేగుంట : మెదక్ జిల్లా చేగుంట నుండి మెదక్ వెళ్లే హైవేలో రైతులు బైఠాయించి యూరియా యాప్ ను ఎత్తివేయాలి అని పొలంపల్లి చౌరస్తా లో  పొలంపల్లి...
మంజీరా నీటిపై చార్మినార్‌ బేవరేజెస్‌ దోపిడీ?
మాజీ ఎమ్మెల్యే ఎర్ర సత్యం వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
లార్డ్ ఉదయ్ నాగరాజు తెలంగాణకు గర్వకారణం
500 మీటర్ల జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ
హరే కృష్ణ కిచెన్‌లో పరిశుభ్రత ప్రమాణాలు పాటించాలి: బల్దియా కమిషనర్ వెంకన్న
గంభీరావుపేట లో జాతీయ తిరంగా ర్యాలీ