తెలంగాణ రాష్ట్ర ఓరుగల్లు దళిత చైతన్య సభ వాయిదా

తెలంగాణ రాష్ట్ర ఓరుగల్లు దళిత చైతన్య సభ వాయిదా

హన్మకొండ న్యూస్ :  హనుమకొండలోని హయగ్రీవాచారి గ్రౌండ్‌లో వరంగల్, జనగామ, హన్మకొండ జిల్లాల ఈ నెల 30న నిర్వహించాల్సిన “ఓరుగల్లు కాంగ్రెస్ పార్టీ దళిత చైతన్య సభ” అనివార్య కారణాల వల్ల వాయిదా పడినట్లు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్  తెలిపారు.ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, సీనియర్ దళిత కాంగ్రెస్ నాయకులతో రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్‌మెంట్ చైర్మన్‌తో చర్చించిన అనంతరం సభ నిర్వహించే కొత్త తేదీ, వేదికను  ఖరారు చేసి ప్రకటించనున్నట్లు తెలిపారు.కొత్త తేదీ, వేదిక ఖరారైన వెంటనే సభ విజయవంతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, కార్యాచరణ ప్రణాళికను వెల్లడిస్తామని పేర్కొన్నారు. సభ వాయిదా నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు, అన్ని మండలాల ఎస్సీ డిపార్ట్‌మెంట్ చైర్మన్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సహకరించాలని కోరారు.సభ వాయిదా పడినందున ఈ నెల 30న హయగ్రీవాచారి గ్రౌండ్‌కు ఎవరూ రావద్దని చిలువేరు శ్రీనివాస్  స్పష్టం చేశారు.

Views: 12

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

 జగన్ మోహన్ రావు కి రాఖీలు కట్టిన 47వ డివిజన్ ఆడబిడ్డలు  జగన్ మోహన్ రావు కి రాఖీలు కట్టిన 47వ డివిజన్ ఆడబిడ్డలు
మంచిర్యాల టౌన్ రాఖీ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 47వ డివిజన్ కు చెందిన ఆడబిడ్డలు మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు...
సందడిగా మారిన మంచిర్యాల మార్కెట్
రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపిన రఘునాథ్ వెరబెల్లి
బోధన్‌ ఎమ్మెల్యే వ్యాఖ్యలు దురదృష్టకరం 
తెలంగాణ రాష్ట్ర ఓరుగల్లు దళిత చైతన్య సభ వాయిదా
అనుబంధానికి ప్రతిక... రాఖీ వేడుక: ఎమ్మెల్యే కె ఆర్  నాగరాజు 
కాజీపేటలో అదనపు రైలు హాల్టులు,