రాఖీలతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆత్మీయ సందడి
అన్నాచెల్లెళ్ల అనుబంధం ఎల్లప్పుడూ కొనసాగాలి: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు
బిచ్కుంద,: రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతారావు గారి క్యాంపు కార్యాలయంలో ఆత్మీయ వాతావరణం నెలకొంది. రాజయోగినీ బ్రహ్మకుమారి స్వప్న గారు, బీడీ కార్మికులు, మహిళా సంఘాల సభ్యులు, మహిళలు, చిన్నారులు ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతారావు గారికి రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు వారందరికీ ఆత్మీయంగా రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అన్నాచెల్లెళ్ల అనుబంధం, ప్రేమ, ఆప్యాయతలు ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. రక్షాబంధన్ పర్వదినం సమాజంలో సోదరభావం, ప్రేమ, పరస్పర గౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


