జాతీయ క్రీడా దినోత్సవంలో ఓదెల క్రీడాకారునికి ఘన సన్మానం...

జాతీయ క్రీడా దినోత్సవంలో ఓదెల క్రీడాకారునికి ఘన సన్మానం...

ఓదెల :జాతీయ క్రీడా దినోత్సవం సందర్బంగా పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఐ డి ఓ సి హాల్ లో మై భరత్ నెహ్రు యువ కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలో పెద్దపల్లి జిల్లా నుండి ఉత్తమ ప్రతిభ చూపిన 15 మంది క్రీడా కారులకు సన్మానం చేశారు. మన ఓదెల మండలం దాసరి పద్మా హన్మయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కనగర్తి కి చెందిన ముద్దమళ్ళ అజయ్ కుమార్ అథ్లెటిక్స్ లో రాష్ట్ర స్థాయి గోల్డ్ మెడల్,బాక్సింగ్ లో రాష్ట్ర స్థాయి బ్రాంజ్ మెడల్ సాధించినందుకు మై భరత్ నెహ్రు యువ కేంద్రం వారు శాలువ తో సన్మానిస్తూ మూమెంటో ను బహుకరించారు.ఈ కార్యక్రమం లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మై భారత్  యూత్ ఆఫీసర్,పెద్దపల్లి జిల్లా నోడల్ ఆఫీసర్ తులా శోభా రాణి పాల్గొన్నారు.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News