ఇసుక రీచ్ ల వద్ద అక్రమంగా భారీ దోపిడీ..!!
కాంట్రాక్టర్ లదే ఇష్టారాజ్యం..!
చోద్యం చూస్తున్న అధికారులు..!!

ములుగు (మంగపేట) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇసుక సరఫరాలో అక్రమాలను నియత్రించటానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది. అయినప్పటికీ దీనికి విరుద్దంగా మండలంలో ఓడగూడెం ఇసుక రీచ్ ల వద్దా వసూళ్ళ పర్వం యథేచ్ఛగా కొనసాగుతోంది. ఒక్క లారికి రూ.3500నుండి రూ. 4000 వేల వరకు వసూళ్లు చేస్తున్నారు అని లారీ డ్రైవర్లు వాపోతున్నారు. దీనికి తోడు కాంట పార్కింగ్ ఇసుక లెవలింగ్ సీరియల్ అంటూ ఒక్కదానికి ఒక్కొక్క రేటు నిర్ణయించి డబ్బులు అక్రమంగా వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇసుక రీచ్ కాంట్రాక్టర్లు ఈ విదంగా బహిరంగంగానే వసూళ్లు చేస్తుండడం చూస్తుంటే అధికారుల పర్యవేక్షణ లోపించడం, లేదా కొందరి అధికారులు సహకారంతో ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఎన్నో ఫిర్యాదులు వసున్న అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.

నిబంధనల ప్రకారం ఇసుకను అందించాలి :
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రజలకు ఇసుకను అందుబాటులోనికి తెచ్చేందుకు సుమారు 70 యార్డులను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆన్లైన్ ఇసుక బుక్ చేసుకున్న వారికి సీరియల్ ప్రకారం ఇసుకను సరఫరా చేయాలి. ప్రస్తుతం వర్షాలకు గోదావరి నది ప్రవహిస్తున్నందున 13 ఇసుక రీచ్ లు ఆన్లైన్లో నడుస్తున్నాయి. టన్నుకు 412 రూపాయలు నిర్దేశించిన రుసుముతో ఆన్లైన్లో బుక్ చేసుకుని డి డీ రూపంలో కేటాయించిన ఇసుకరీచ్ వద్దకు వెళ్లి లారీ డ్రైవర్ డిడిని కాంట్రాక్టర్ కి ఇస్తే రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం లారీ లోడ్ చేయాలి. కానీ దానికి భిన్నంగా ఇసుక రీచ్ కాంట్రాక్టర్లు ప్రభుత్వ నిబంధనలు పక్కన పెట్టి లారీల నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. దీనిని ప్రభుత్వ అధికారులు, టీజీఎండిసి మైనింగ్ శాఖ, రెవిన్యూ శాఖ ల అధికారులు సంయుక్తంగా ఇసుక రిచ్ కాంట్రాక్టర్లు లారీల వద్ద నుండి అక్రమంగా వసూలు చేస్తున్న తతంగాన్ని అరికట్టాలని లారీ డ్రైవర్లు యజమానులు ప్రభుత్వ అధికారులను వేడుకుంటున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


