సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్న హమారా ప్రసాద్ పై దేశద్రోహం కేసు పెట్టాలి.
- మాల సంఘం వ్యవస్థాపకులు ఎలా సంతోష్ డిమాండ్ చేశారు.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం. : హమారా ప్రసాద్ అనే కల్పిత వ్యక్తి ఈ నెల 18 వ తేదీన బాబాసాహెబ్ అంబేద్కర్ పై కల్పిత నాయకుడు అంబేద్కర్ అనే పేరు మీద పుస్తకం విడుదల చేస్తున్నందున దానిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు మంత్రులు అడ్డు కోవాలని, లేని యెడల వారిని బీసీ, ఎస్సీ,ఎస్టీ ద్రోహులు గా చిత్రి కరిస్థామని మాల సంఘం తెలంగాణ వ్యవస్థాపకులు అయ్యాల సంతోష్ అన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే అన్ని కులాలు వారు అన్ని మతాల వారు రాజ్యాంగం అందించే అన్ని ఫలాలు అందుకుంటున్నారు. అందుకే రాజ్యాంగం ను తీసేయాలని కుట్ర పన్ను తున్నారని, హమారా ప్రసాద్ అనే కల్పిత వ్యక్తి, భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి తప్పుడు మాటలు మాట్లాడుతూ. నిజాలను వక్రీకరించి సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నా హమారా ప్రసాద్ పై కాంగ్రెస్ ప్రభుత్వం దేశా ద్రోహం కేసు పెట్టి చట్ట రిత్య చర్య తీసుకోవాలని, తెలంగాణ ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు స్పందించాలని, లేని యెడల రాబోయే రోజులలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఉద్యమాలు భారీ ఎత్తున నిర్వహిస్తామని అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ అందరి వాడు, అన్ని సామాజిక వర్గాలకు విద్యా, ఉద్యోగ, రాజకీయాల లో రిజర్వేషన్ లు, ఓటు హక్కు, మహిళలకు అన్నిరంగాల లో అనేక హక్కులు కల్పించిన మహనీయుడని, బాబా సాహెబ్ అంబేద్కర్ చూపిన బాట లో నడవాలని, రాజ్యాంగం ను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


