ఖమ్మం జిల్లాలో...రెండో దఫా అక్రిడేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు?
- రెండు నెలలుగా ఎదురుచూస్తున్న ఖమ్మం జిల్లా జర్నలిస్టులు
- మొదటి దశలో 800 మందికి కార్డులు.. రెండో దశ కోసం సుమారు 400 మంది నిరీక్షణ
- ఉపముఖ్యమంత్రి,సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి ఇలాకాలోనే
- అక్రిడేషన్ కార్డుల కోసం ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టులు
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, తెలంగాణ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గార్ల ఇలాకా లోనే జర్నలిస్టులు అక్రిడేషన్ కార్డుల కోసం ఇబ్బందులు పడుతున్నారు గత రెండు నెలలుగా రెండవ దఫా కార్డులు ఎప్పుడు జారీ చేస్తారని సుమారు 400 మంది కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.ఖమ్మం జిల్లాలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మొదటి దశలో సుమారు 800 మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు జారీ చేసినప్పటికీ అన్ని అర్హతలు ఉండి రెండవ దఫా అక్రిడేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకొని ఎదురుచూస్తున్న 400 మంది జర్నలిస్టులు ఇంకా ఉన్నారు. రెండో దశ అక్రిడిటేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న జర్నలిస్టులు తమ కార్డులు ఎప్పుడు వస్తాయో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అనేక రోజులు గడిచినా ఈ ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో జర్నలిస్టుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ఎవరి వద్ద ఆగింది?
అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియలో జిల్లా కలెక్టర్, అక్రిడిటేషన్ కమిటీ, డీపీఆర్వో కార్యాలయం మధ్య సమన్వయం లేకపోవడం వల్లే జాప్యం జరుగుతోందా? అనే ప్రశ్నలు జర్నలిస్టుల్లో వ్యక్తమవుతున్నాయి. కమిటీ సమావేశానికి సమయం కుదరడం లేదా? అధికారుల స్థాయిలో నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతోందా? అనే విషయాలు స్పష్టంగా తెలియక జర్నలిస్టులు అయోమయానికి గురవుతున్నారు. తమ సమస్యను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక రెండవ దఫా అక్రిడేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న జర్నలిస్టులు మాత్రం తమ సమస్యను ఎవరిని సంప్రదించాలో, ఎప్పుడు పరిష్కారం లభిస్తుందో తెలియని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. జిల్లా అధికార యంత్రాంగం స్పందించి అక్రిడిటేషన్ ప్రక్రియపై స్పష్టమైన సమాచారం ఇవ్వాలని వారు కోరుతున్నారు.అధికారుల నుంచి స్పష్టత కావాలి జర్నలిస్టులు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో నిరంతరం విధులు నిర్వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారి వృత్తిపరమైన గుర్తింపుకు సంబంధించిన కార్డుల జారీ ప్రక్రియలో సాక్షాత్తు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి ఇద్దరు ఉద్దండులు ఉన్న ఇలాకాలోనే జర్నలిస్టులకు ఇలా ఇబ్బందులు జరిగితే మిగతా జిల్లాల వారి పరిస్థితి ఏమిటి అని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు చర్చించుకుంటున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రెండవ అక్రిడేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభించాలని రెండవ దఫా అక్రిడేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న జర్నలిస్టులు కోరుతున్నారు.లేనిపక్షంలో ఈ విషయం ఉపముఖ్యమంత్రి దృష్టికి సంబంధిత శాఖ మంత్రి దృష్టికి తీసుకు వెళ్లేందుకు కూడా సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది
- సీనియర్ పాత్రికేయులు
- కందుకూరి యాదగిరి
- 9640282050
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


