హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో సంత్ గురు రవిదాస్ జయంతి ఉత్సవాలు

వాల్ పోస్టర్ ఆవిష్కరణ

హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో సంత్ గురు రవిదాస్ జయంతి ఉత్సవాలు


నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా బీజేపీ దళిత మోర్చా అధ్యక్షులు భూషయ్య ఆధ్వర్యంలో సంత్ గురు రవిదాస్ జయంతి ఉత్సవాల వాల్ పోస్టర్ ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భూషయ్య మాట్లాడుతూ... రాబోయే ఆగస్టు 23, 2026న హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో సంత్ గురు రవిదాస్ జయంతి ఉత్సవాల మహా సమావేశాన్ని అత్యంత వైభవంగా నిర్వహించ నున్నట్లు తెలిపారు. సమాజంలో సమత, మమత, భ్రాతృత్వాన్ని ప్రబోధించిన గొప్ప ఆధ్యాత్మిక వేత్త సంత్ గురు రవిదాస్ ఆశయాల ను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. నాగర్ కర్నూల్ జిల్లా నలుమూలల నుండి దళిత మోర్చా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఆగస్టు 23న హైదరాబాద్ లో జరిగే ఈ కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చి విజయ వంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేందర్ గౌడ్, వివిధ మండలాల అధ్యక్షులు, దళిత మోర్చా జిల్లా నాయకులు రేణయ్య, శంకర్, రాము మరియు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

బిఆర్ఎస్ అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి: కడియం శ్రీహరి బిఆర్ఎస్ అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి: కడియం శ్రీహరి
స్టేషన్ ఘన్‌పూర్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు....
గజ్వేల్‌లో వైభవంగా లక్ష్మణ్ జన్మదిన వేడుకలు
రైతులకు స్ప్రింక్లర్ పైపులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా.కూచుకుళ్ల రాజేష్ రెడ్డి
అనధికారిక నూనె మిల్లు సీజ్
హత్యకు కారకులైన విద్యార్థులను కఠినంగా శిక్షించాలి : ట్రస్మా
శ్రీ సంతోషిమాత ఆలయంలో శ్రీ వరలక్ష్మీ వ్రత ప్రత్యేక పూజలు
ఎల్ నీనో ప్రభావంతో ప్రస్తుత పంటల పరిస్థితి ఫై రైతులకు అవగాహన