వైభవంగా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి శాకాంబరి మహోత్సవం
అమ్మవారి అభిషేకంలో పాల్గొన్న సర్పంచ్ కొండ రమేష్ గౌడ్
రాజన్న సిరిసిల్ల ,ఎల్లారెడ్డిపేట, : ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో మంగళవారం శాకాంబరి మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మహోత్సవంలో భాగంగా ఉదయం అమ్మవారికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అభిషేక కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, గ్రామం సుభిక్షంగా అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. శాకాంబరి మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించగా, అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ నిర్వాహకులు, గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.
Views: 18
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
11 Aug 2026 15:38:41
రాజన్న సిరిసిల్ల,ఎల్లారెడ్డిపేట, :ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్‌లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై ఎన్. రమేష్ గౌడ్‌ను మండల గౌడ సంక్షేమ సంఘం నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి...
