అర్ధరాత్రి రోడ్డుపై ఆవులు
ప్రమాదాల బారిన పడుతున్న వాహనదారులు
మంచిర్యాల టౌన్ :మంచిర్యాల పట్టణంలోని బెల్లంపల్లి చౌరస్తా వద్ద అర్ధరాత్రి వేళ ఆవులు, పశువులు తిష్ట వేస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నల్లటి పశువులు కనిపించకపోవడంతో తరచూ ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు.రహదారులపై రాకపోకలకు ఆటంకం కలుగుతుంది రాత్రి వేళల్లో రోడ్ల మధ్యలోనే పశువులు నిద్రించడం తో వేగంగా వచ్చే వాహనాలకు అకస్మాత్తుగా బ్రేకులు వేయడం కష్టంగా మారుతోంది పట్టించుకోని యజమానులు పశువుల యజమానులు వాటిని రాత్రి వేళల్లో పాకల్లో ఉంచకుండా రోడ్లపైకి వదిలేస్తుండటం తో ఈ సమస్య తీవ్రమవుతోంది అధికారుల నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నారు మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి పశువులను కాజిషెడ్లకు తరలించి యజమానులకు జరిమానాలు విధించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


