చదువుకున్న పాఠశాలను గుర్తు పెట్టుకుని అభివృద్ధి చేయడం అభినందనీయం - ఇన్‌చార్జి మంత్రి సీతక్క

చదువుకున్న పాఠశాలను గుర్తు పెట్టుకుని అభివృద్ధి చేయడం అభినందనీయం - ఇన్‌చార్జి మంత్రి సీతక్క

కామారెడ్డి : చదువుకున్న పాఠశాలను గుర్తు పెట్టుకుని అభివృద్ధి చేయడం అభినందనీయ అని జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క అన్నారు. 1971లో షబ్బీర్ అలీ  విద్యనభ్యసించారని,పాఠశాల షబ్బీర్ ఆలీ జీవితంలో ఎంతో ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉందన్నా రు. ఈ పాఠశాల  ఒక విద్యాలయం కాదు... ఒక జీవితానికి పునాది వేసిన ప్రదేశం. ఇక్కడి నుంచే  బడికి ఏదో ఒక మంచి చేయాల నే తపన ఎప్పటి నుంచో ఉందని తాను ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా తనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను, తనతో కలిసి చదువుకున్న మిత్రులను, ఆ పాఠశాల జ్ఞాపకాలను ఎప్పటికీ షబ్బీర్ అలీ మర్చిపోకుండా పాఠశాల అభివృద్ధికి కృషి చేయడం ఎంతోఅభినందనీయమని మంత్రి సీతక్కఅన్నారు.ఈ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థి మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని. వారు ఉన్నత స్థాయికి ఎదిగి, తమ పాఠశాలకు, తమ సమాజానికి తిరిగి సేవ చేయాలి” అని షబ్బీర్ అలీని ఉద్దేశించి మాట్లాడారు.కామారెడ్డి బాయ్స్ స్కూల్ అభివృద్ధి అవసరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి రూ.5 కోట్ల నిధులు మంజూరు చేయించేందుకు ప్రత్యేకంగా కృషి చేశారని షబ్బీర్ అలీ ని అభినందించారు.పాత భవనాన్ని తొలగించి ఆధునిక ప్రమాణాలతో నూతన పాఠశాల భవనాన్ని నిర్మించనున్నట్లు చెప్పారు. విద్యార్థులకు నేటి విద్యా ప్రమాణాలకు అనుగుణంగా మెరుగైన వసతులు కల్పించాలన్నదే లక్ష్యమన్నారు.ఆధునిక తరగతి గదులు, డిజిటల్ విద్యా సౌకర్యాలు, కంప్యూటర్ ల్యాబ్‌లు, ప్రయోగశాలలు, విద్యార్థులకు అవసరమైన ఇతర మౌలిక వసతులతో పాఠశాలను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ నిధులతో పాటు పాఠశాల అభివృద్ధికి అవసరమైన చోట తన వంతుగా కూడా సహకరిస్తానని షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. చదువు నేర్పిన బడికి మనం రుణపడి ఉంటాం. ఆ రుణాన్ని పూర్తిగా తీర్చలేకపోయినా... మనకు చేతనైనంత మంచి చేయడం ప్రతి పూర్వ విద్యార్థి బాధ్యత” అని ఆయన అన్నారు. - జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షెట్కర్ మాట్లాడుతూ,  తాను చదువుకున్న పాఠశాల అభివృద్ధికి షబ్బీర్ అలీ చూపుతున్న శ్రద్ధ స్ఫూర్తిదాయకమన్నారు. పాఠశాల అభివృద్ధికి రూ.5 కోట్ల నిధులు మంజూరు చేయించడమే కాకుండా, విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలు కల్పించాలనే ఆలోచనతో ముందుకు సాగడం అభినందనీయమన్నారు. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆయన ఆకాంక్షించారు. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ, కామారెడ్డి బాయ్స్ స్కూల్ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన జరగడం సంతోషకరమన్నారు. పాత భవనం స్థానంలో ఆధునిక వసతులతో కొత్త భవనం నిర్మాణం ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం అందుబాటులోకి వస్తుందని తెలిపారు.పాఠశాల అభివృద్ధికి షబ్బీర్ అలీ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ,  కామారెడ్డి బాయ్స్ స్కూల్‌కు నూతన భవనం నిర్మించడం ద్వారా విద్యార్థులకు మరింత మెరుగైన, ఆధునిక విద్యా వాతావరణం అందుబాటులోకి వస్తుందని అన్నారు. తాను చదువుకున్న పాఠశాల అభివృద్ధికి రూ.5 కోట్ల నిధులు మంజూరు చేయించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్  కృషిని అభినందించారు.
'బడిని మరచిపోని బిడ్డ'
తాను చదువుకున్న పాఠశాలను మరచిపోకుండా, అదే పాఠశాల అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులు తీసుకురావడంతో పాటు ఆధునిక సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్న షబ్బీర్ అలీపై పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు అభినందనలు వ్యక్తం చేశారు. జీవితంలో ఎంత ఎదిగినా తనకు విద్యనందించిన పాఠశాలను గుర్తుంచుకుని, భవిష్యత్ తరాల విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలనే ఆలోచన “చదువు ఇచ్చిన బడికి రుణం తీర్చుకోవాలనే గొప్ప మనసుకు నిదర్శనం” అని పలువురు కొనియాడారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Views: 31

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం
హైదరాబాద్ : బీసీ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించి, వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పడే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న *“ఇంటింటా ఇందిరమ్మ కుట్టు...
సెప్టెంబర్ 17 న హైదరాబాద్ లో టి. ఆర్.పి పాదయాత్ర
బాలాపూర్ లో స్పీకర్ గడ్డ ప్రసాద్ కు ఘన స్వాగతం
ప్రధాని మోదీ పుట్టినరోజున ప్రతి ఇంట దీపం వెలిగించాలి
సీఎం రేవంత్ రెడ్డి తో సింగపూర్ వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇంధనవాణిజ్య విభాగం శాశ్వత కార్యదర్శి అగస్టిన్ లీ భేటీ.. 
సెప్టెంబర్‌ 17పై సమరశంఖం!
చాంద టి నిమజ్జన ప్రదేశాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్