అనాజిపురంలో  దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు

పచ్చదనంతో నివాళులర్పించిన కాంగ్రెస్ శ్రేణులు

అనాజిపురంలో  దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు

పెన్ పహాడ్,  (సూర్యాపేట): తెలంగాణ రాజకీయ యవనికపై తనదైన ముద్ర వేసిన ఉమ్మడి నల్లగొండ  మాజీ మంత్రివర్యులు, ‘టైగర్’ రాంరెడ్డి దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు. మండల పరిధిలోని అనాజిపురం గ్రామంలో సోమవారం నాడు పండుగ వాతావరణంలో జరిగాయి. పెన్ పహాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూముల సురేష్ రావు పిలుపును అందుకుని, అనాజిపురం గ్రామ సర్పంచ్ అనుములపూరి నాగయ్య  అత్యంత ప్రతిష్టాత్మక అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ముందుగా రాంరెడ్డి దామోదర్ రెడ్డి  చిత్రపటానికి పూలమాలలు వేసి, ఆయన చేసిన ప్రజాసేవలను స్మరించుకుంటూ కాంగ్రెస్ శ్రేణులు భావోద్వేగ నివాళులర్పించాయి. అనంతరం ఆయన ఆశయాలకు ప్రతీకగా, పర్యావరణ పరిరక్షణను కాంక్షిస్తూ గ్రామంలోని పలు ప్రధాన ప్రాంతాలలో విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ అనుములపూరి నాగయ్య మాట్లాడుతూ.. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి దామోదర్ రెడ్డి  చేసిన అసాధారణ సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన చూపిన బాటలోనే కాంగ్రెస్ కార్యకర్తలంతా నడుస్తూ పార్టీ బలోపేతానికి కట్టుబడి ఉండాలని పిలుపుని చ్చారు. ఈ సేవా కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ మేడిమేలపు దామోదర్ రెడ్డి, ఉప సర్పంచ్ చెన్ను స్వప్న భరత్ రెడ్డి, వలపట్ల వెంకట నర్స్, మెరిగ లచ్చయ్య, ఆలగడప జానయ్య, చెన్ను జయమ్మ, అన్న మేరీ  నర్సి శెట్టి తదితరులు పాల్గొన్నారు.

Views: 17

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

నాగులపహాడ్‌లో వెల్లివిరిసిన  దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు నాగులపహాడ్‌లో వెల్లివిరిసిన  దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు
పెన్ పహాడ్, ( సూర్యాపేట): సూర్యాపేట నియోజకవర్గ వికాసానికి అహర్నిశలు శ్రమించిన ప్రజానేత, మాజీ మంత్రివర్యులు ‘టైగర్’ రాంరెడ్డి దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు పెన్ పహాడ్మండల...
అనాజిపురంలో  దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు
దోసపహాడ్‌లో ఘనంగా  రాంరెడ్డి దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు
ఉచిత మట్టి గణపతుల పంపిణీ
లచ్చునాయక్ ని పరామర్శించిన బుసిరెడ్డి పాండురంగారెడ్డి..
సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్న హమారా  ప్రసాద్ పై దేశద్రోహం కేసు పెట్టాలి.
వినాయక చవితి పండగ శుభాకాంక్షలు తెలిపిన పోచారం.