కడుపులో కణజాల గడ్డ తొలగింపు
మందమర్రి, (మంచిర్యాల):పొత్తికడుపులోని పెల్విక్ ప్రాంతంలో ఏర్పడ్డ రెండు కిలోల కణజాల గడ్డను 39 ఏళ్ల వయస్సు కలిగిన మహిళా కడుపులో నుంచి తొలగించి శస్త్ర చికిత్సను విజయవంతం చేసినట్లు రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రి డివైసీఎంవో మధుకుమార్ పేర్కొన్నారు. ఈ నెల 14 న ఆసుపత్రిలో చేరిన ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ప్రత్యేక వైద్య బృందం గైనకాలజిస్ట్ వైద్యురాలు హరిత, లలిత,అనస్థీషియా మధుకర్ శస్త్ర చికిత్స పూర్తి చేసినట్లు తెలిపారు. మహిళా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండడంతో గురువారం డిశ్చార్జ్ చేసినట్లు చెప్పారు.
Views: 25
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
21 Aug 2026 17:20:05
స్టేషన్ ఘన్‌పూర్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు....
