కళ్యాణ లక్ష్మి, షాది మొబారకు పై అసత్య ప్రచారాలు చేయవద్దు
- ప్రజలను మభ్య పెట్టొద్దు, రాజకీయాలు చేయవద్దు
- 5రూ"భోజనశాలపై మొదటి రెండేళ్ల పాటు చెల్లించలేదు,
- నోటీసు ఇచ్చిన తరువాత బకాయిలు చెల్లించారు
నాగర్ కర్నూల్: ప్రస్తుత ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి సర్పంచ్ స్థాయి కానోడు ఎమ్మెల్యేగా వచ్చారు అన్నారుకదా మరి మీరు 2012లో పోటీ చేసినప్పుడు ఓడిపోయారు, 2014లో మళ్ళీ పోటీ చేసి గెలవడం జరిగింది, అప్పుడు మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు అంటూ నాగర్ కర్నూల్ మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర ఆధ్వర్యంలో సాయంత్రం 5pm ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో జరిగిన విలేకరులు సమావేశంలో ఆయన అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...కళ్యాణ లక్ష్మి, షాది మొబారకు పై అసత్య ప్రచారాలు చేయవద్దు, కోర్టు ప్రభుత్వంపై వేసిన కేసు దానికి మా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదని అన్నారు. 5రూ"భోజనశాలపై 2023లో మున్సిపల్ పర్మిషన్ తీసుకున్న రెండు సంవత్సరాలు ఎలాంటి రుసుము చెల్లించలేదని, నోటీసులు ఇచ్చాకే బకాయిలు చెల్లించారనీ, గడిచిన పది సంవత్సరాలు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారని, కానీ ఎప్పుడు 5రూ"భోజనశాల, ఉచిత డ్రైవింగ్ లెర్నింగ్ లైసెన్స్లు గుర్తు రాలేదా అది కేవలం ఎన్నికలకు నాలుగు నెలల ముందు సమయంలో మాత్రమే గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. 2018లో జరిగిన ఎన్నికలలో ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి మీ వెంటఉండి అందించిన సహాయ సహకారాల వల్లే విజయం సాధించారని మర్చిపోయినట్టుంది ఆ విషయాన్ని మరోసారి ఆత్మ విమర్శన చేసుకోవాలని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే కన్నా మాజీ ఎమ్మెల్యే ఇందులో కూడా గొప్ప అయితే కాదని, ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్, మంచి ప్రొఫెషన్ నుంచి వచ్చి, ప్రస్తుత సమాజంలో ఎన్నో సేవ కార్యక్రమాలను చేస్తూ గడిచిన మూడు సంవత్సరాలలో 1000 కోట్ల నిధులు తీసుకుని వచ్చారని అన్నారు. ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలను ఖండిస్తూ కౌన్సిలర్ జక్క రాజు మాట్లాడుతూ... గడచిన పది సంవత్సరాల్లో మీరు ఎమ్మెల్యేగా చేయలేని పనులు ప్రస్తుత ఎమ్మెల్యే మూడు సంవత్సరాలలో చేసేసరికి ప్రజల ముందర ఆయనకు ఏం మాట్లాడాలో తెలియకే ఇలా మాట్లాడుతున్నారని, ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పాలన గురించి మాట్లాడే ముందు మరోసారి ఆత్మ విమర్శలు చేసుకోవాలని అన్నారు. 5 రూ// భోజనశాలను ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వద్దంటున్నా మాట అవాస్తవమని, 2023లో మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం లేకుండానే GO తీసుకోవడం జరిగిందని, అప్పుడున్న పరిస్థితులలో అది పేద ప్రజల కోసం, ఆకలిని తీర్చేది గనక మేము ఏమీ అనలేదని, మినిట్స్ బుక్కులో కేవలం మున్సిపల్ చైర్మన్ సంతకం మాత్రమే ఉందని కౌన్సిలర్ ఎవరు ఆమోదించలేదని అన్నారు. కాల పరమతి ముగిసినందున మున్సిపల్ శాఖ రిమాండ్ చేయడం జరిగిందనీ కానీ ఆయన ప్రజలలో ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు వద్దంటున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, 2012 ఎన్నికల సమయంలో ఆయన ప్రతి సంవత్సరం సామూహిక వివాహాలు జరిపిస్తానని చెప్పిన వాగ్దానాన్ని కేవలం నాలుగు సార్లు మాత్రమే చేశారని మొదటి సంవత్సరం 05/02/2014న 84జంటలకు, రెండవ సంవత్సరం 22/05/2015న 102జంటలకు, మూడవ సంవత్సరం 20/01/2017న 130జంటలకు, నాలుగో సంవత్సరం 01/12/2019న 165 జంటలకు అంటే మాట ఇచ్చిన 14 సంవత్సరాల కాలంలో కేవలం నాలుగు సార్లు మాత్రమే జరిపించరని అన్నారు. ఎన్నికల ముందు నాగర్కర్నూల్ పట్టణ కేంద్రంలోని వివిధ వార్డ్లలో ప్రొసీడింగ్ పర్మిషన్, ఎల్ఓసిలు లేకుండా కాంట్రాక్టర్లచే రోడ్ల తవ్వకాలు చేయించారు, వాటి మరమ్మత్తులు, బిల్లులు ప్రస్తుత ఎమ్మెల్యే ఆర్థిక మంత్రి ద్వారా ఇప్పియడం జరిగిందని తెలిపారు.
Views: 53
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
21 Aug 2026 17:20:05
స్టేషన్ ఘన్‌పూర్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు....
