నిబంధనలు అతిక్రమించిన స్కానింగ్ సెంటర్ల సీజ్

నిబంధనలు అతిక్రమించిన స్కానింగ్ సెంటర్ల సీజ్

నిజామాబాద్  : నిజామాబాద్ నగరంలో  జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిన్న బుధవారం  రాత్రి నిజాంబాద్ నగరంలోని బోధన్ రోడ్డు నందు గల పి టి ఎస్ స్కానింగ్ సెంటర్ మరియు అహమ్మద్ పుర కాలనీలోని క్లినిక్  మరియు నిబంధనలు అతిక్రమించిన స్కానింగ్ సెంటర్లను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ  తనిఖీ చేసి షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. పి టి ఎస్ స్కానింగ్ సెంటర్ నందు ఓపి రిజిస్టరు మరియు ఫామ్ ఎఫ్ అసంపూర్తిగా ఉండడం, ఆసుపత్రి పరిసరాలు అ పరిశుభ్రంగా ఉండడం, రిఫరల్ ఫామ్స్ ద్వారా నాన్ మెడికల్ వ్యక్తుల చేత రిఫర్ చేయడం, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ నిబంధనలు అతిక్రమించినందున శోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అహ్మద్ పుర కాలనీ లోని ఇంకొక ఆసుపత్రి క్లినిక్లో  యునాని వైద్యుడు చికిత్స అందించాల్సింది, యునాని పేరు పెట్టి అలోపతి వైద్యం అందిస్తుండడం, ఆసుపత్రిలో అలోపతి మెడిసిన్స్ లభించడం అదేవిధంగా పిల్లల వైద్య నిపుణులు మరియు శ్రీ వైద్య నిపుణుల సేవలు అందుబాటులో ఉన్నట్లు బోర్డును ప్రదర్శించడం తో వాటిని తొలగించడం జరిగింది, ఈ విధంగా నిబంధనలకు విరుద్ధం ఉండడం చేత శోకాస్ నోటీసు ఇవ్వడం జరిగింది. ఈరోజు 20. 08. 2026 బోధన్ రోడ్డులోని హయత్ హాస్పిటల్ యాబై పడకల ఆసుపత్రి తనిఖీ చేయడం జరిగింది ఇక్కడ కూడా ఆసుపత్రి ఆవరణలో పార్కింగ్ స్థలం మరియు ర్యాంపు  లేకపోవడం, త్రీ కలర్ కోడెడ్ బిన్స్ ద్వారా చెత్తను, వేస్టేజ్ ను సేకరించకపోవడం, డాక్టర్ కావ్య ప్రత్యక్షంగా లేకపోవడమే కాక డిజిటల్ సంతకాన్ని ఉపయోగించడం, ఓపి రిజిస్టర్ను అర్హతలేని వ్యక్తుల చేత రాయించడం, ఎంటి పీలో రిజిస్ట్రీ కాకుండానే మే 2025 నుండి ఈరోజు వరకు నిబంధనలకు విరుద్ధంగా మొత్తం 51 ఆపరేషన్లను చేయడం,  రికార్డ్లను రిపోర్టులను అసంపూర్తిగా కలిగి ఉండడం, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్టి సర్టిఫికెట్ లేకుండానే పిల్లల వైద్య నిపుణుల సేవలను అందించడం, నెలవారి రిపోర్టులను నివేదికలను ఫామ్ ఎఫ్ ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి అందజేయకపోవడం, పి సి పి ఎన్ డి టి కి సంబంధించిన డేటాను గత ఐదు సంవత్సరాల నుండి వారి దగ్గర లేకపోవడం, అసంపూర్తి స్కానింగ్ రిఫరల్ షీట్స్ మరియు, గడువుతీరిన ఔషధాలు ఆపరేషన్ థియేటర్లో లభించడం తో నిబంధనలకు విరుద్ధంగా ఆసుపత్రిని నిర్వహిస్తున్నందున వారికి కూడా షోకాజ్ నోటీసు అందించడం జరుగుతుంది అని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ  తెలియజేశారు ఇంకా ఈ తనిఖీల్లో జిల్లా వైద్యాధికారి తో పాటు ఏవో సుమంత్ కుమార్ , డాక్టర్ సుప్రియ, డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ కీర్తన, డి హెచ్ ఈ,వేణుగోపాల్ నాగరాజు పాల్గొన్నారు.
 
IMG-20260820-WA0601
 
Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

బిఆర్ఎస్ అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి: కడియం శ్రీహరి బిఆర్ఎస్ అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి: కడియం శ్రీహరి
స్టేషన్ ఘన్‌పూర్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు....
గజ్వేల్‌లో వైభవంగా లక్ష్మణ్ జన్మదిన వేడుకలు
రైతులకు స్ప్రింక్లర్ పైపులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా.కూచుకుళ్ల రాజేష్ రెడ్డి
అనధికారిక నూనె మిల్లు సీజ్
హత్యకు కారకులైన విద్యార్థులను కఠినంగా శిక్షించాలి : ట్రస్మా
శ్రీ సంతోషిమాత ఆలయంలో శ్రీ వరలక్ష్మీ వ్రత ప్రత్యేక పూజలు
ఎల్ నీనో ప్రభావంతో ప్రస్తుత పంటల పరిస్థితి ఫై రైతులకు అవగాహన